జొమాటోలో రూ.40 ఉప్మా రూ.120కి సేల్.. ఇదెక్కడి దోపిడీ??

ఆన్‌లైన్‌లో ఫుడ్స్‌( Online Foods ) చాలా ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు.అదే ఆహారాన్ని రెస్టారెంట్‌లో చాలా తక్కువ ధరకు పొందచ్చనే విషయం కస్టమర్లకు తెలియదు.

 Rs.40 Upma Sale For Rs.120 In Zomato.. Where Is The Robbery, Zomato, Kerala, Udu-TeluguStop.com

జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆహారం చాలా ఎక్కువ రేటు ఉంటుందని ఇప్పుడిప్పుడే కస్టమర్లు తెలుసుకుంటున్నారు.ఈ యాప్‌లు సర్వీస్ చార్జీలు, ప్లాట్‌ఫాం చార్జీలు వంటివి జోడించడం వల్ల, రెస్టారెంట్‌ మెనూలో ఉన్న ధర కంటే యాప్‌లో ఉన్న ధర ఎక్కువగా ఉంటుంది.

తాజాగా ఒక కస్టమర్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత వచ్చిన బిల్లును ఆన్‌లైన్‌లో ఉన్న ధరతో పోల్చి చూపారు.ఈ ధరల తేడా చూసి చాలామంది ఆశ్చర్యపోతారు.

ముంబైలోని వైల్ పార్లేలో ఉన్న ఉడుపి2ముంబై అనే రెస్టారెంట్‌లో భోజనం చేసిన అభిషేక్ కోఠారి అనే జర్నలిస్ట్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు.ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి, తనకు వచ్చిన బిల్లు ఫోటోను పంచుకున్నారు.

Telugu Idli, Kerala, Mumbai, Socialmedia, Udupi Hotel, Upma, Zomato-Latest News

అభిషేక్ ఆ రెస్టారెంట్‌( Abhishek restaurant )లో సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నారు.రెస్టారెంట్‌లో దోసె ధర 40 రూపాయల కాగా జొమాటో యాప్‌( Zomato )లో అదే దోసె 120 రూపాయలకు అమ్ముతున్నారు.అలాగే, తట్టె ఇడ్లీ రెస్టారెంట్‌లో 60 రూపాయలు ఉంటే, జొమాటోలో 161 రూపాయలకు అమ్ముతున్నారు.అంటే, రెస్టారెంట్‌ కంటే జొమాటోలో ఆహారం ధర చాలా ఎక్కువ.

Telugu Idli, Kerala, Mumbai, Socialmedia, Udupi Hotel, Upma, Zomato-Latest News

అభిషేక్ రెస్టారెంట్‌లో తిన్న ఆహారం అంతా జొమాటోలో ఎంత ధరకు ఉంటుందో చూశారు.రెస్టారెంట్‌లో ఆయన 320 రూపాయలు చెల్లించారు.కానీ, అవే ఆహారాన్ని జొమాటోలో ఆర్డర్ చేసి ఉంటే, 740 రూపాయలు చెల్లించాల్సి ఉండేది.అంటే, రెస్టారెంట్‌ కంటే జొమాటోలో ఆహారం ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

అంతేకాకుండా, జొమాటోలో టీ కూడా లేదని ఆయన చెప్పారు.రెస్టారెంట్‌లో ఉప్మా 40 రూపాయలు ఉంటే, జొమాటోలో అదే ఉప్మా 120 రూపాయలు.

అలాగే, తట్టె ఇడ్లీ రెస్టారెంట్‌లో 60 రూపాయలు ఉంటే, జొమాటోలో 161 రూపాయలు అని సదరు జర్నలిస్టు తన పోస్టులో పేర్కొన్నాడు.అయితే దీనిపై జొమాటో రిప్లై ఇచ్చింది.

ఇది రెస్టారెంట్‌ పార్ట్‌నర్s నిర్ణయించే ధర అని చెప్పింది.అయితే జొమాటోనే ఇంత ఎక్కువ ధరలు చెప్పి తమ ఫుడ్స్ అమ్ముతుందంటూ రెస్టారెంట్ ఓనర్ చెప్పినట్లు సదరు జర్నలిస్టు వెల్లడించాడు.

అయితే ఈ పోస్ట్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు.బయట తినడం మంచిది యాప్స్ లో చాలా రేట్ ఎక్కువ అని కామెంట్ చేస్తున్నారు.

ఈ దోపిడీ యాప్స్ ను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube