‘‘ నల్లజాతీయురాలా, భారతీయురాలా ’’ .. కమలా హారిస్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు.బైడెన్ తప్పుకుని రేసులోకి కమలా హారిస్ రావడంతో అప్రమత్తమైన ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు.

 ‘black Or Indian’ Donald Trump Launches ‘racially Insensitive’ Attack On-TeluguStop.com

తాజాగా బుధవారం చికాగోలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ ( National Association of Black Journalists )(ఎన్ఏబీజే) కన్వెన్షన్‌లో ట్రంప్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.సాంకేతిక సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా ఇంటర్వ్యూ ప్రారంభమైంది.

నల్లజాతి ఓటర్లు ఆయనకు ఎందుకు మద్ధతు ఇవ్వాలి అనే ప్రశ్నలను విలేకరులు సంధించారు.

అయితే గతంలో ఎన్నడూ ఈ తరహా ప్రశ్న ఎదురుకాకపోవడంతో ట్రంప్ తడబడ్డారు.

తాను ఈ దేశంలోని నల్లజాతి జనాభాను ప్రేమిస్తున్నానని.వారి కోసం చాలా చేశానని ఆయన వెల్లడించారు.

అంతేకాదు.తనను తాను ప్రఖ్యాత అమెరికా అధ్యక్షులతో పోల్చుకున్నాడు.

నల్లజాతీయుల ఓటర్ల సమస్యపై ప్రశ్నించగా.అబ్రహం లింకన్( Abraham Lincoln ) తర్వాత నల్లజాతి జనాభాకు తానే బెస్ట్ ప్రెసిడెంట్‌నని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Telugu Blackindian, Abraham Lincoln, Donald Trump, Kamala Harris, National Black

కమలా హారిస్( Kamala Harris ) తన రాజకీయ ప్రయోజనాల కోసం బ్లాక్ కార్డ్ వాడుతున్నారని.ఆమె అన్ని రకాలుగా భారతీయురాలేనని, కానీ ఆకస్మాత్తుగా నల్లజాతి మహిళ అయింది.గతంలో డెమొక్రాట్ వైస్ ప్రెసిడెంట్ నామినీగా మారిన తర్వాత తన ఆసియా అమెరికన్ నేపథ్యం గురించి మాత్రమే మాట్లాడారని ట్రంప్ దుయ్యబట్టారు.ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ వారసత్వాన్ని మాత్రమే ప్రచారం చేస్తోందని .ఇంతకీ ఆమె భారతీయురాలా.లేక నల్లజాతీయురాలా చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.

Telugu Blackindian, Abraham Lincoln, Donald Trump, Kamala Harris, National Black

డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా ప్రచారం జరుగుతున్న కమలా హారిస్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉండగా అలా జరగలేదు.హారిస్‌ను కన్వెన్షన్‌కు రప్పించడానికి ఎన్ఏబీజే శాయశక్తుల ప్రయత్నించిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.అయితే కమలా హారిస్ వర్చువల్‌గా పాల్గొనేందుకే ఆసక్తి చూపడంతో నిర్వాహకులు తిరస్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube