గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో గత వైసిపి( YCP ) ప్రభుత్వం హయాంలో బాగా ఫేమస్ అయిన అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రస్తుతం గత వైసిపి ప్రభుత్వం పాలన పైన , జగన్ తీరు పైన రోజుకో వీడియో విడుదల చేస్తూ ఉండడం , ఆ వీడియోలు బాగా వైరల్ కావడం సంచలనంగా మారింది.కేతిరెడ్డి మాట్లాడిన మాటలను టిడిపి తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉండగా , కొన్ని వ్యాఖ్యలను వైసీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది.
మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేతిరెడ్డి ( Kethi Reddy )వ్యాఖ్యలు పెద్ద సంచలనంగానే మారాయి.అయితే ఎక్కడా పార్టీ గురించి కేతిరెడ్డి వ్యతిరేకంగా మాట్లాడలేదు.
కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపించి దాని ద్వారా, జరిగిన నష్టాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు.సినిమా టికెట్లు రేట్లు తగ్గింపు, నా ఎస్సీ , నా ఎస్టి, నా బిసి అనే నినాదాన్ని వినిపించడం ద్వారా, మిగతా సామాజిక వర్గాలకు వైసీపీ దూరం అయిందనే విషయాన్ని కేతిరెడ్డి ఎత్తి చూపించారు.
![Telugu Dharmavaram Mla, Ys Jagan-Politics Telugu Dharmavaram Mla, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/What-will-Jagan-do-who-is-not-giving-birth-to-Kethi-Reddyc.jpg)
మొదట్లో వైసీపీ ఓటమి తరువాత దానికి గల కారణాలను వివరించి సంచలనం సృష్టించిన కేతిరెడ్డి, ఆ తర్వాత నేరుగా పులివెందుల వెళ్లి జగన్ ను కలిసి వచ్చారు.ఆ తరువాత నుంచి సోషల్ మీడియా ద్వారా గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న తప్పిదాలను వివరిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్లు రేట్లు తగ్గించాలని జనాలు అడగలేదని, ఆయన తనకు తానే తగ్గించి సినిమా వాళ్లకు జగన్ దూరమయ్యారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ అంటూ మిగతా వర్గాలను దూరం చేసుకున్నా.
జగన్ నమ్మిన వర్గాలు వైసిపికి వ్యతిరేకంగా మారాయి అనే విషయాన్ని కేతిరెడ్డి చెబుతున్నారు.ఈ సందర్భంగా టిడిపి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కేతిరెడ్డి అనేక వ్యాఖ్యలు చేశారు.
![Telugu Dharmavaram Mla, Ys Jagan-Politics Telugu Dharmavaram Mla, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/08/What-will-Jagan-do-who-is-not-giving-birth-to-Kethi-Reddyd.jpg)
తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ( Chandrababu )చెప్పారని , కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది సమయంలోనే ఆ పథకాలపై నిలదీయడం సరికాదని కేతిరెడ్డి హితవు పలికారు.అయితే కేతిరెడ్డి వ్యాఖ్యలలోని కొన్ని అంశాలను వైసీపీ అనుకూల మీడియా , మరికొన్ని అంశాలను టిడిపి అనుకూలం మీడియా హైలెట్ చేసుకుని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి.