వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సా ? ఆయనే ఎందుకంటే ?

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటిషన్ , మాజీమంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satya Narayana ) పేరును ఖరారు చేసింది .ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తొలిసారి జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికల్లో టిడిపి,  జనసేన , బిజెపి కూటమి పై పైచేయి సాధించే విధంగా జగన్ వ్యూహరచన చేస్తున్నారు.

 Botsa Satya Narayana As Ycp Candidate For Visakha Local Bodies Mlc Elections Det-TeluguStop.com

ఈ నేపద్యంలోనే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స ను ప్రకటించారు.  వైసీపీకి సంఖ్య పరంగా బలం ఉంది.

దీంతో గెలుపు ఖాయం అనే లెక్కల్లో జగన్ ఉన్నారు.వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్( Vamsikrishna Yadav ) జనసేనలో చేరడంతో ఆయనపై వేటు పడింది.

Telugu Botsasatya, Jagan, Mlc, Vamsikrishna, Visakha Mlc, Ycp Mlc Candi-Politics

ఈ పరిణామంతో ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.ఈ ఎన్నికల్లో ఓట్ల పరంగా వైసిపికి మెజార్టీ ఉంది .ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు,  యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు,  జెడ్పిటిసిలు,  ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.మొత్తం 841 ఓట్లు ఉండగా, అందులో వైసిపికి 615 ఉన్నాయి.

  టిడిపి,  జనసేన,  బిజెపి సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి.ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోకి వలసల పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

Telugu Botsasatya, Jagan, Mlc, Vamsikrishna, Visakha Mlc, Ycp Mlc Candi-Politics

జీవీఎంసీలో( GVMC ) 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు.  విశాఖకు చెందిన కార్పొరేటర్లతో పాటుగా ,పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు.  పార్టీకి పూర్తిగా బలం ఉండడంతో అందరూ సమన్వయంతో పనిచేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో( MLC Elections ) విజయానికి సహకరించాలని కోరారు .అలాగే అభ్యర్థి ఎంపిక పైన వారి అభిప్రాయాలను సేకరించగా,  బొత్స పేరును ఎక్కువమంది సూచించడంతో,  ఆయన పేరును అధికారికంగా ఖరారు చేశారు.ఎన్నికకు ఈనెల 6 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.13 వరకు నామినేషన్ల స్వీకరణ ,16 వరకు ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు.ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి , సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది .సెప్టెంబర్ 3 కౌంటింగ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube