మెగా డాటర్ నిహారిక ( Niharika ) ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈమె హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నటిగా వెబ్ సిరీస్ లు నటిస్తూ ఉన్నారు.
ఈ విధంగా సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా మారి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా నిర్మిస్తున్నారు.ఇక ఈమె నిర్మాతగా తెరకెక్కిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్ళు.
ఈ సినిమా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా బరువు బాధ్యతలను మొత్తం నిహారిక తన భుజాలపై వేసుకున్నారు.
ఈ సినిమా ద్వారా నిహారిక కొత్త వారందరిని పరిచయం చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక స్టార్ ఫ్యామిలీ నుంచి నిర్మాతగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమెకు మెగా కుటుంబం( Mega Family ) నుంచి ఏ ఒక్క హీరో సపోర్ట్ కూడా లభించలేదు.దీంతో నిహారిక ఒంటరిగా ఈ సినిమా బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఇదే ప్రశ్న ఎదురయింది.
ఇంట్లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఎవరూ కూడా తన సినిమాకు సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురవడంతో నిహారిక సమాధానం చెబుతూ నా సినిమా కోసం మా నాన్నే సపోర్ట్ చేయడం లేదు ఆయన రాజకీయాల( Politics ) పరంగా బిజీగా ఉంటూ మంగళగిరిలోనే ఉంటున్నారు కనీసం ఇంటికి కూడా రావడం లేదు ఇక బాబాయ్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇక పెదనాన్న, చరణ్ అన్న ఒలంపిక్స్ లో భాగంగా పారిస్ కి వెళ్ళిపోయారు.
అన్నయ్య తన సినిమా పనుల నిమిత్తం వైజాగ్ లోనే ఉన్నారు.ఇక వదిన కాలు ఫ్రాక్చర్ కావడంతో డెహ్రాడూన్ లో ఉంటున్నారు.
ఇలా నా సినిమా రిలీజ్ టైం లోనే వీరందరూ బిజీ అయ్యారని, వారంతా ఫ్రీ అయినప్పుడు నా సినిమా తప్పకుండా చూపిస్తాను అంటూ నిహారిక కామెంట్స్ చేశారు.