తెలుగు సినిమా ఇండస్ట్రీని 40 సంవత్సరాల నుంచి శాశిస్తున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి…( Megastar Chiranjeevi ) ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎలా ఉన్నాడో 70 సంవత్సరాల వయసులో కూడా అదే జోష్ అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తుండటం నిజంగా చాలా మంచి విషయం…ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇక యంగ్ హీరోలైనా సినిమాలు చేస్తూ అలసిపోతున్నారేమో కానీ, చిరంజీవి మాత్రం ఎక్కడ అలసిపోకుండా ముందుకు సాగుతున్నాడు.
![Telugu Chiranjeevi, God, Harish Shankar, Maruthi, Mohan Raja-Movie Telugu Chiranjeevi, God, Harish Shankar, Maruthi, Mohan Raja-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/Chiranjeevi-is-once-again-giving-a-chance-to-a-Tamil-director-detailss.jpg)
ఇక విశ్వంభర( Vishwambhara ) సినిమాతో ప్రస్తుతం తన ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్న చిరంజీవి తన తదుపరి సినిమాని తమిళ్ స్టార్ డైరెక్టర్ తో చేయాలని ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గత సంవత్సరంలో ‘గాడ్ ఫాదర్’( God Father ) సినిమాతో భారీ ఫ్లాప్ ను మూట గట్టుకున్న చిరంజీవి ఆ సినిమాను తెరకెక్కించిన మోహన్ రాజా( Mohan Raja ) డైరెక్షన్ లో మరొక సినిమాను రీమేక్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి… ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశ్యం లో చిరంజీవి ఉన్నారట.ఇక రీమేక్ సినిమాలు అంటే అందరికి మోహన్ రాజానే గుర్తుకువస్తాడు.
![Telugu Chiranjeevi, God, Harish Shankar, Maruthi, Mohan Raja-Movie Telugu Chiranjeevi, God, Harish Shankar, Maruthi, Mohan Raja-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/Chiranjeevi-is-once-again-giving-a-chance-to-a-Tamil-director-detailsa.jpg)
ఎందుకంటే ఆయన చాలావరకు సినిమాలను రీమేక్ చేస్తు సక్సెస్ లను అందుకున్నాడు.కాబట్టి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చిరంజీవి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక చిరంజీవి తో సినిమా చేయడానికి మన స్టార్ డైరెక్టర్లు అయిన హరీష్ శంకర్, మారుతి లాంటి వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం తమిళ్ సినిమా డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం పట్ల మనవాళ్లు కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మరి మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాని చేస్తున్నాడా లేదా అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు.ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు కు సంభందించిన పూర్తి వివరాలను తొందర్లోనే అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది…
.