కాఫీ.చాలా మంది దీన్ని అమితంగా ఇష్టపడతారు.
కాఫీ అనే పేరు చెబితేనే కొందరు ఏదో ఎమోషన్‌లా ఫీల్ అవుతుంటారు.మార్నింగ్ లేవగానే వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగితే.ఆ రోజంతా చాలా ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తారు.కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.మోతాదు మించి మాత్రం తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇక కాఫీ ఆరోగ్యానికే కాదు.
చర్మ సౌందర్యాన్ని మెరిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.మరి కాఫీ పౌడర్‌ను చర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుని.అందులో శెనగపిండి, కలబంద పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి.పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుముకం పడతాయి.
మరియు ఈ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా కూడా మారుస్తుంది.
అలాగే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుని.అందులో చిటికెడు పసుపు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల.
ముఖంపై ఉన్న బ్యాక్టీరియా తొలిగి క్షణాల్లో ఫ్రెష్ లుక్ సంతరించుకుంటుంది.
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుని.
అందులో కొద్దిగా పంచదార మరియు తెనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి.
మెల్లగా స్క్రబ్ చేయాలి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారినికి ఒకసారి చేస్తే.చర్మంపై ఉన్న మృతకణాలు సులువుగా వదిలి.
ప్రకాశవంతంగా మారుతుంది.