ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే స్వీట్ న్యూస్.. ప్రశాంత్ మూవీ షూట్ మొదలు అప్పుడేనా?

ఎన్టీఆర్( NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబో క్రేజీ కాంబో కాగా ఈ కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా మొదట ప్రచారంలోకి వచ్చిన వార్తల ప్రకారం ఈ నెలలోనే మొదలుకావాల్సి ఉండగా ఈ సినిమా తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో మొదలు కానుంది.

 Shocking Updates About Junior Ntr Prashant Neel Combo Movie Details, Ntr, Prasha-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది.

అయితే మేకర్స్ వైపు నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఒకింత స్పెషల్ గా ఉండనుందని విదేశాల్లో ఈ సినిమా షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ నెలలో దేవర( Devara ) ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.

సెప్టెంబర్ నెల 27వ తేదీన దేవర మూవీ థియేటర్లలో విడుదల కానుంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఏకంగా 300 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.సలార్( Salaar ) సినిమా సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సలార్ 2 కంటే ముందు ఎన్టీఆర్ సినిమాకే ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

గత రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వార్తల్లో వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ అభిమానులను ఎంతగానో మెప్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube