నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నర్సింగ్ బట్ల గ్రామంలో నాలుగు తరాల నుంచి వారసత్వంలో ఉన్న 60 ఎకరాల భూ వివాదం గురువారం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.దీనితో ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నర్సింగ్ బట్ల గ్రామంలో వారసత్వంగా వస్తున్న 60 ఎకరాల భూమిని నాలుగు సమాన వాటాలు కాకుండా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఇచ్చారనేది వివాదానికి మూలం.అప్పటినుండి కారింగి కుటుంబాలలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఇందులో ఎల్లయ్యకు 13 ఎకరాలు,రామయ్యకు 13 ఎకరాల 30 గుంటలు, మారయ్యకు 14 ఎకరాల 10 గుంటలు,సైదులుకు 15 ఎకరాల 20 గుంటలు ఇవ్వడంతో నలుగురు పాలీ వాటాల పంచాయితీ షురూ అయింది.అందరూ సమానంగా పంచుకోవాలని పెద్దల సమక్షంలో ఎన్నోసార్లు పంచాయితీలు పెట్టగా పరిష్కారం దొరకలేదు.
అందరికీ సమాభాగం కావాలని కుటుంబీకులు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోలీసు వారు కలగజేసుకొని ఇరు పక్షాల వాళ్లు గొడవలు లేకుండా కోర్టును ఆశ్రయించి మాట్లాకోవాలని తెలిపారు.
సైదులుకు 15 ఎకరాల 20 గుంటల భూమి అందరికన్నా ఎక్కువ రావడంతో గురువారం అందులో నాటు వేస్తున్నందున నాటు వేయొద్దని ఎల్లయ్య, రామయ్య,మారయ్య కుటుంబీకులు అడ్డుకున్నారు.
ఇది కాస్త ఘర్షణకు దారి తీసి, కర్రలు,కత్తులతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలోనలుగురికి తీవ్ర గాయాలు కాగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.నల్లగొండ రూరల్ ఎస్సై సైదాబాబు బాధితుల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలను శాంతింపజేసి, సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.