వర్షాకాలంలో వేధించే గొంతు నొప్పికి వంటింటి చిట్కాలతో చెక్ పెట్టండి!

ప్రస్తుత వర్షాకాలంలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో గొంతు నొప్పి ( Sore throat )ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పులు, కలుషితమైన నీటిని తీసుకోవడం, డీహైడ్రేషన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీ తదితర అంశాలు గొంతులో చికాకు మరియు నొప్పికి కారణం అవుతుంటాయి.

 Check Monsoon Sore Throat With Home Remedies , Home Remedies, Sore Throat, Th-TeluguStop.com

గొంతు నొప్పి కారణంగా తీవ్రమైన ఇబ్బందికి గుర‌వుతుంటారు.మాట్లాడటానికి, తినడానికి, తాగడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు మందులు వాడుతూ ఉంటారు.అయితే సాధారణ గొంతు నొప్పికి మందులతో పని లేకుండా కొన్ని ఇంటి చిట్కాలతో కూడా చెక్ పెట్టవచ్చు.

టిప్ 1

: ముందుగా ఒక గ్లాసు మరిగించిన వాటర్ ను తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు( Salt ) మరియు పావు టీ స్పూన్ పసుపు( Turmeric ) వేసి బాగా కలపాలి.ఈ వాటర్ ను నోట్లో వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు పుక్కిలించాలి.

రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేశారంటే గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు.

Telugu Tips, Latest, Monsoon, Sore Throat, Throat Pain-Telugu Health

టిప్ 2

: మెంతులు కూడా గొంతు నొప్పిని తరిమి కొట్టడంలో సహాయపడతాయి.ఒక గ్లాస్ వాటర్ లో ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి.ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే గొంతు నొప్పి సమస్య దూరం అవుతుంది.

టిప్ 3

: ప్రతిరోజు రాత్రుళ్లు మిరియాలు, చిటికెడు పసుపు మరియు బెల్లం వేసి మరిగించిన పాలు తీసుకోవాలి.గొంతు నొప్పిని తగ్గించడానికి, జలుబు దగ్గు వంటి సమస్యలను దూరం చేయడానికి ఈ పాలు చాలా బాగా సహాయపడతాయి./br>

<s

Telugu Tips, Latest, Monsoon, Sore Throat, Throat Pain-Telugu Health

trong>టిప్ 4

: ఇక ఒక గ్లాస్ వాటర్ లో ఐదు తులసి ఆకులు,( Basil leaves ) వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) వేసి బాగా మరిగించి నీటిని వాడ కట్టాలి.ఆ నీటిలో రుచికి సరిపడా తేనెను కలిపి సేవించాలి.ఈ హెర్బల్ టీలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి.

ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయ‌పడతాయి.గొంతు నొప్పిని తరిమి కొడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube