తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఫిమేల్ యాంకర్ విష్ణు ప్రియ భీమినేని( Vishnu Priya Bhimeneni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఉన్న ఫిమేల్ యాంకర్స్ లో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు.
హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ.యాంకర్ విష్ణుప్రియ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, పండుగ సమయాలలో నిర్వహించే ఈవెంట్ లలో కూడా సందడి సందడి చేస్తూ ఉంటుంది.ఇకపోతే విష్ణు ప్రియ బిగ్‌బాస్ షోలో అడుగుపెడుతుందని ప్రతి ఏడాది రూమర్లు వస్తూనే ఉంటాయి.
అయితే ఈసారి ప్రచారం కాస్త ఊపందుకుంది.తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోకి( Bigg Boss Telugu 8 ) విష్ణుప్రియ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని నెట్టింట ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ ఊహాగానాలపై విష్ణుప్రియ స్పందించింది.ఈ సందర్భంగా బిగ్ బాస్ ఎంట్రీ పై ఆమె స్పందిస్తూ.బిగ్‌బాస్‌కు వెళ్తే నేను పది కిలోల బరువు తగ్గుతానన్న నమ్మకం ఉంది.నిజానికి నాకు బిగ్‌బాస్ షోకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు.
కానీ ఎందరో ప్రేక్షకుల దీవెనల వల్ల రియాలిటీ షోలో అడుగుపెడతానేమోనని భయమేస్తోంది.చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు.
వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా మీరు నన్ను బిగ్‌బాస్‌లో చూస్తారు అని చెప్పింది.అక్కడే ఉన్న రీతూ చౌదరి( Rithu Chowdary ) సైతం.నాది కూడా విష్ణుప్రియ లాంటి పరిస్థితే అని పేర్కొంది.ఈ సందర్భంగా విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే గతంలోకి ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లడం పై స్పందిస్తూ ఎన్ని కోట్లు ఇచ్చినా సరేనా జీవితంలో బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాను అని తెలిపింది.అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యక్షమవుతానేమో చూస్తారేమో అన్నట్టుగా మాట్లాడడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విష్ణు ప్రియ మాటలను బట్టి చూస్తే ఈసారి ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది.