మమ్మల్ని వేధిస్తున్నారు ... సభలో కేటీఆర్ ఫైర్ 

తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే,  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఆవేశంగా మాట్లాడారు.ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Brs Mla Ktr Slams Congress Govt For Targeting Opposition Leaders Details, Kcr, K-TeluguStop.com

తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని, పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారని శాసనసభలో కెసిఆర్ తెలిపారు.తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడడంలో రాజీ పడబోమని,

ఎవరిపై వేధింపులు ఉండబోవని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) చెప్పగా,  దీనిపైన కేటీఆర్ స్పందించారు.

తాము లేవనెత్తిన కొన్ని అంశాలపై మంత్రి స్పందించలేదని అన్నారు.  ఐపీసీ  స్థానంలో తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కర్ణాటక,  పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని సవరణలు తీసుకువచ్చాయని , తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) మాత్రం ఎలాంటి సవరణలు తీసుకు రావడంలేదని అన్నారు.

Telugu Brs Mla Ktr, Congress, Hunger, Sridhar Babu, Pcc, Revanth Reddy, Telangan

కేంద్రం తెచ్చిన చట్టాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని,  సవరణలు చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఆ బిల్లు తీసుకువస్తారో సభకు తెలియజేయాలని కేటీఆర్ కోరారు.ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు,  చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయడం కూడా కొత్త చట్టాల ప్రకారం నేరమని, అలాంటి చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణలో పోలీసుల వైఖరి పైన కేటీఆర్ విమర్శలు చేశారు.

Telugu Brs Mla Ktr, Congress, Hunger, Sridhar Babu, Pcc, Revanth Reddy, Telangan

వివిధ ప్రతిపక్ష పార్టీలు,  ప్రజా సంఘాల పై అనధికారిక ఒత్తిడి , బల ప్రయోగం సరికాదని , చట్టాలను ప్రభుత్వం దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు.పౌర హక్కుల సంఘం నాయకులు ఇటీవల హైదరాబాద్ లోని ఓ హాలులో సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని,  ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు .ఇంకా అనేక అంశాలపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తగా దీనిపై స్పీకర్ సైతం స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube