నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొడితే.. వీసా ఫ్రీ, భారత సంతతి సీఈవో బంపరాఫర్

ప్రపంచ ప్రఖ్యాత పారిస్ ఒలింపిక్స్( Paris Olympics ) నేపథ్యంలో వీసా సేవలు అందించే ‘‘ Atlys ’’ సంస్థ సీఈవో మోహక్ నహతా( Mohak Nahta ) లింక్డిన్‌లో సంచలన పోస్ట్ పెట్టారు.2024 పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా( Neeraj Chopra ) బంగారు పతకం గెలిస్తే .తన వినియోగదారులకు ఒక రోజు ఉచితంగా వీసాలు( Free Visa ) అందిస్తానని పోస్ట్ చేశారు.మరో పోస్ట్‌లో దీనిపై ఆయన క్లారిటీ సైతం ఇచ్చారు.

 Indian-origin Ceo Promises Free Visa For Everyone If Neeraj Chopra Wins Gold In-TeluguStop.com

ఆగస్ట్ 8న జరగనున్న పోటీల్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీగా వీసా ఇస్తామని వాగ్థానం చేశానని వెల్లడించారు.మీలో చాలా మంది నన్ను వివరాలు అడిగారు కాబట్టి.

అది ఎలా వర్కవుట్ అవుతుందో వివరిస్తానని మోహక్ పేర్కొన్నారు.

Telugu Atlys, Ceo Mohak Nahta, Visa, Gold Medal, Mohak Nahta, Neeraj Chopra, Nee

అన్ని దేశాలకు వెళ్లే వ్యక్తులకు ఇది వర్తిస్తుందని.ఇందుకోసం రుసుము కింద పైసా కూడా వసూలు చేయబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు మోహక్ నహతాకు పలు సూచనలు కూడా చేస్తున్నారు.ఇక Atlys విషయానికి వస్తే.2020లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో( San Francisco ) ఈ కంపెనీని స్థాపించారు.భారత్ , అమెరికాలలో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.

ఇండియాలో ముంబై, గురుగ్రామ్‌లని కేంద్రాలలో వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు ఈ కంపెనీ సాయం చేస్తుంది.

Telugu Atlys, Ceo Mohak Nahta, Visa, Gold Medal, Mohak Nahta, Neeraj Chopra, Nee

కాగా.ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో 2021కి ముందు భారత్‌ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది.కానీ మూడేళ్ల క్రితం నీరజ్ చోప్రా సంచలన ప్రదర్శన చేశాడు.

స్వర్ణం గెలిచి దేశంలో అథ్లెటిక్స్‌కు ఆదరణ పెంచాడు.నీరజ్ స్పూర్తితో మన అథ్లెట్లు పతక వేటలో సాగిపోతున్నారు.

ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగిపోయాయి.ఈసారి కూడా అతను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడని అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుతం నీరజ్ చోప్రా మంచి ఫాంలోనే ఉన్నాడు.గతేడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు.

ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube