భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న ఎన్ఆర్ఐలు.. ఐదేళ్లలో ఎంత మందో తెలుసా..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడుతుండటంతో తమ భారత పౌరసత్వాన్ని( Indian Citizenship ) వదులుకుని అక్కడి పౌరులుగా వుండేందుకే ఇష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో గతేడాది 2,16,000 మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్( Kirti Vardhan Singh ) ఈ మేరకు పార్లమెంట్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

2011 నుంచి 2018తో పాటు గడిచిన ఐదేళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్యను ఆయన వివరించారు.

"""/" / 2023లో 2,16,219 మంది .2022లో 2,25,620 మంది.

2021లో 1,63,370 మంది.2020లో 85,256 మంది.

2019లో 1,44,017 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా( Raghav Chadha ) ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పెద్ద సంఖ్యలో భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం వెనుక కారణాలను ప్రభుత్వం పరిశోధించిందా, ఆర్ధిక , మేధోపరమైన నష్టాలను అంచనా వేసిందా అని ప్రశ్నించారు.

దీనికి మంత్రి కీర్తి వర్ధన్ తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు.పౌరసత్వాన్ని వదులుకోవడం లేదా పొందడం అనేది వ్యక్తిగత విషయమని, నేటి నాలెడ్జ్ ఎకానమీలో గ్లోబల్ వర్క్‌ఫోర్స్ అందించిన అవకాశాలను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు.

"""/" / ఇదే సమయంలో భారతదేశం 2024లో భారీ ఎత్తున మిలియనీర్ల వలసలను చూడబోతోందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జూన్‌లో విడుదలైన హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్డ్ 2024లో .భారత్ ఈ ఏడాది 4,300 మంది మిలియనీర్లను వదులకోనుందని పేర్కొంది.

ఇది 2023తో (5,100) పోల్చితే తగ్గినప్పటికీ.ప్రపంచవ్యాప్తంగా అధిక నికర విలువ గల వ్యక్తిగత నిష్క్రమణలను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)( United Arab Emirates ) భారతీయ మిలియనీర్లకు అనుకూలమైన గమ్యస్థానంగా నిలుస్తోంది.

2024లో రికార్డు స్థాయిలో 6700 మంది మనదేశానికి చెందిన సంపన్నులు ఆ దేశానికి వలస వెళ్తారని అంచనా.

ఆదాయపు పన్ను లేకపోవడం, గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, విలాసవంతమైన జీవనశైలి వంటి అంశాలతో యూఏఈ భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

తండేల్ సినిమాలో నాగ చైతన్య కి సపోర్ట్ గా నాగార్జున కూడా నటిస్తున్నాడా..?