తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో శర్వానంద్( Sharwanand ) ఒకరు… ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయి వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన ‘మనమే’ సినిమా( Manamey Movie ) భారీ డిజాస్టర్ గా మారింది.ఇక తను ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనే దాని మీద చాలా రకాల కసరత్తులు చేస్తున్నాడు.
ఇక దానికి అనుగుణంగానే వివిధ దర్శకులతో మంతనాలు అయితే జరుపుతున్నాడు.
ఇక దాంతోపాటుగా మరొక రెండు సినిమాలకు కూడా ఆయన కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.అయితే శర్వానంద్ మాత్రం ఎన్ని సినిమాలు చేసిన ఆయనకు రావాల్సిన సక్సెస్ లు అయితే రావడం లేదు.మిగతా హీరోలందరి కంటే తను సీనియర్ అయినప్పటికీ నిన్న మొన్న వచ్చిన సిద్దు జొన్నల గడ్డ,( Siddu Jonnalagadda ) తేజ సజ్జ( Teja Sajja ) లాంటి హీరోలు స్టార్ హీరోలుగా వెలుగుతుంటే, శర్వానంద్ మాత్రం ఒక హిట్ ఇస్తే ఆ తర్వాత ఐదు ఫ్లాప్ పాము ఇస్తున్నాడు.
ఎందుకు ఆయనకి ఇలా జరుగుతుంది అంటూ చాలామంది సిని మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్ లోనే చాలా వరకు లోపాలు ఉంటున్నాయి అంటూ అందువల్లే ఆయన సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఆయన నుంచి ఇప్పటి కన్న భారీ సక్సెస్సులు వచ్చి ఆయన స్టార్ హీరోగా మారుతాడా లేదా అనేది…
.