స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ ను బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.బాలయ్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో పని చేసి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.35 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
బాలయ్యతో సినిమాలను తెరకెక్కించిన కోదండరామిరెడ్డి( Kodandaramireddy ) సీనియర్ ఎన్టీఆర్ గారికి నాపై ఎంతో నమ్మకం ఉండేదని కామెంట్లు చేశారు.ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) బాలయ్య కోసం మంచి కథను సిద్ధం చేయాలని సూచించారని ఆయన అన్నారు.
బాలయ్య కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని ఆ కథను ఎన్టీఆర్ గారికి వినిపించగా పదే పది నిమిషాలలో ఓకే చేశారని కోదండరామిరెడ్డి తెలిపారు.
బాలయ్యతో అనసూయమ్మ గారి అల్లుడు( Anasuyamma Gari Alludu ) సినిమాను తెరకెక్కించానని ఆయన వెల్లడించారు.అనసూయమ్మ గారి అల్లుడు మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణ చాలా సరదాగా ఉన్నారని సీనియర్ ఎన్టీఆర్ కొడుకైనా బాలయ్యలో అణువంతైనా గర్వం ఉండదని ఆయన పేర్కొన్నారు.బాలయ్య సెట్ లోకి వస్తే అందరినీ నమస్కరించేవారని కోదండరామిరెడ్డి వెల్లడించడం గమనార్హం.
భోజనాలు చేశారా? టీ తాగారా? అని బాలయ్య అందరినీ ఆప్యాయంగా అడిగేవారని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య అందరితో కలిసిపోయేవారని గర్వం లేకుండా మాట్లాడేవారని కోదండ రామిరెడ్డి వెల్లడించారు.నేను ఎక్కడైనా బాలయ్యను కలిస్తే ఇంట్లోని ప్రతి ఒక్కరి గురించి బాలయ్య అడుగుతారని బాలయ్య గొప్పదనం ఇదేనని ఆయన పేర్కొన్నారు.కోదండరామిరెడ్డి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.