రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటించిన “తిరగబడరా సామీ”( Thiragabadara Saami ) మూవీ ఆగస్టు 2న విడుదలైన సంగతి తెలిసిందే.రవి కుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మన్నారా చోప్రా, రఘుబాబు, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా చెత్త అని, చాలా బోరింగ్‌గా ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూస్ వచ్చేసాయి.మాల్వీ మల్హోత్రా( Malvi Malhotra ) చాలా అందంగా ఉంటుంది కానీ ఈ సినిమాలో ఆమె పాత్రను బాగా రాయలేదు.
రాజ్ తరుణ్( Raj Tarun ) క్యారెక్టర్‌ను కూడా అంత గొప్పగా ఏమీ రాసుకోలేకపోయాడు డైరెక్టర్.నిజానికి రాజ్‌తరుణ్‌ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ అంత బలంగా లేదు.
ఎంత ఛాలెంజింగ్ రోల్ డిజైన్ చేసినా కష్టపడి అందులో నటించగల టాలెంట్ రాజ్ తరుణ్ కి ఉంది.ఆ టాలెంట్‌ను వెలికి తీసే టాలెంట్ దర్శకుడికి లేకపోవడం బాధాకరం.
మన్నార్ చోప్రాని మాత్రం బాగా హైలెట్ చేశారు.హాట్ గా ఉన్న ఒక మసాలా కవర్ ఫోటో కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.ఈ సినిమాలోని “రాధా భాయ్” పాటకు మన్నార్ చోప్రా లిరిక్స్ కు తగినట్లు డ్యాన్స్ చేసింది.ఈ పాట కూడా చాలా బాగుంటుంది.తెలంగాణ పదాలు కూడా ఉంటాయి.దీనిని కంపోజ్ చేసింది మరెవరో కాదు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ భోలే షావలీ.
ఈ సినిమా మొత్తానికి అతడే సంగీతం అందించాడు.
ఇక రాజ్ తరుణ్ హీరోగా నటించిన “పురుషోత్తముడు”( Purushothamudu ) వారం రోజుల క్రితమే రిలీజ్ అయింది.ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్ లోనే రిలీజ్ చేయడం నిజంగా ఒక సాహసమే అని చెప్పాలి.
ఇందులో ఏ ఒక్కటీ హిట్ అయినా రెండో సినిమాతో క్లాష్ జరిగి ఉండేది.అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇవి రెండూ ఫ్లాప్ అయి ఎలాంటి సమస్య కలిగించలేదు.
మకరంద్ దేశ్‌పాండేని ఈ మూవీలో తీసుకున్నారు కానీ అతనిలోని యాక్టింగ్ స్కిల్స్ ను సరిగా వాడుకోలేకపోయాడు డైరెక్టర్.
తిరగబడరా సామీ సినిమాలో లాజిక్ లేని సీన్లు ఎన్నో ఉంటాయి.కథ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించదు చాలా రొటీన్ స్టోరీనే ఇందులో చూపించినట్లు అనిపిస్తుంది.ఈ రోజుల్లో థియేటర్ కి ప్రేక్షకుడిని రప్పించడం చాలా కష్టమైపోయింది.
ఓటీటీలు అందుబాటులో ఉండటం, థియేటర్స్‌కి వెళ్తే జేబుకు చిల్లు పడటం వల్ల హాల్స్‌కు వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది.ఇలాంటి సమయంలో వేస్ట్ కథలతో సినిమాలు తీసేస్తే హీరో నిర్మాత దర్శకులు అందరూ నష్టపోతారు.
సినిమా స్టోరీలో కొత్తదనం అయినా ఉండాలి.లేదంటే బ్రహ్మాండమైన థియేటర్ల ఎక్స్‌పీరియన్స్ అయినా కలిగించే లాగా సినిమా ఉండాలి అప్పుడే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
మొత్తం మీద రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ లో అనేక ఇబ్బందులు పడుతున్నాడు.అలానే ఇప్పుడు వరుస ఫ్లాప్స్ కారణంగా అతడి కెరీర్ లైఫ్ కూడా తిరగబడుతోంది!
.