72.62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72.62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఒక ప్రకటనలో తెలిపారు.

 72 Percent Comprehensive House To Family Survey Completed - District Collector S-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే చేయాల్సి ఉండగా నవంబర్ 17 నాటికి మొత్తం 1,39,743 ఇండ్ల సర్వే పూర్తి చేశామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో 1154 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,44,972 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 1,02,521 ఇండ్లు, పట్టణ ప్రాంతాలలో 377 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 47,460 ఇండ్లకు 37,222 ఇండ్ల సర్వే పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 70.72 శాతం, పట్టణ ప్రాంతాల్లో 78.43 శాతం, జిల్లా వ్యాప్తంగా 72.62 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన ఇండ్లలో సైతం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube