అక్రమ గంజాయి రవాణా కేసులో నలుగురు నిందుతుల అరెస్ట్

జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan )నిందితుల వివరములు:1.బట్ట రవీందర్,అక్కాపూర్ 2.అంకర్ ప్రణీత్, బి.వై.నగర్, సిరిసిల్ల.3.ఈగ కృష్ణ, బి.వై.నగర్, సిరిసిల్ల.4.అంకర్ హశ్విత్ బి.వై.నగర్, సిరిసిల్ల,మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రణీత్,కృష్ణ, హశ్విత్ లు గత కొన్ని రోజులుగా జల్సాలకు ఆలవాటు పడి గంజాయి తాగుతు, తమకు అవసరమున్నప్పుడల్లా ముగ్గురు కలిసి బట్ట రవీందర్ దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతూ, గంజాయి తాగే వారికి అధిక రేటుకి అమ్ముతున్నారు.

 Four Accused Arrested In Case Of Illegal Ganja Trafficking , Akhil Mahajan , Sir-TeluguStop.com

నాలుగు రోజుల క్రితం నిదితులు ప్రణీత్,కృష్ణ, హశ్విత్ లు బట్ట రవీందర్ దగ్గరికి గంజాయి గురించి వెళ్ళగా రవీందర్ వద్ద గంజాయి లేనందున ఒక్కొక్కరు 10 వేల రూపాయల చొప్పున ముగ్గురు కలిసి మొత్తం 30 వేల రూపాయలను రవీందర్ ( Ravinder )కు ఇచ్చారు.రవీందర్ నాలుగు రోజుల తర్వాత గంజాయి తీసుకొని సిరిసిల్లకు వచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పడంతో ఏ 2 టూ ఏ 4 లు తిరిగి సిరిసిల్లకు వచ్చారు.

ఎప్పటి మాదిరిగానే ఈ రోజు అనగా తేదీ 11-11-2023 నాడు మద్యాహ్నం అందాదా 2:00 గంటలకు సిరిసిల్ల( Sircilla ) శివారులోని మానేరు వాగు ఒడ్డున మున్నూరుకాపు సంగ భవనం దగ్గరకు ఏ 3 యొక్క బైక్ పై ఏ 2 టూ ఏ 4 లు వెళ్ళి ఉండగా, అక్కడికి ఏ 1 మాచారెడ్డి నుండి తన బైక్ పై 18 కిలోల గంజాను ఒక్కొక్కటి 2 కిలోల ఉండే విదంగా 9 పాకెట్లు గా ప్యాక్ చేసుకొని వచ్చి ఏ 2 టూ ఏ 4 లకు అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల టాస్క్ఫోర్స్, సిరిసిల్ల టౌన్ పోలీస్ లు వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 18 కిలోల గంజాయి, రెండు బైక్ లను స్వాదీనం చేసుకోని నిందితులను రిమాండ్ కు తరలించనైనది.ఇట్టి గంజా కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో పట్టుకోవడం జరుగుతుందన్నారు.

గంజాయి నిందితులను పట్టుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్,ఎస్.ఐ.రవీందర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్స్ అక్షర్, మహిపాల్, శ్రీనివాస్,సిరిసిల్ల టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుందని,గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ సి.ఐ రవీందర్, ఎస్.ఐ రవీందర్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube