ప్రజా వాణి ధరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజావాణికి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti ) ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ( Prajavani )నిర్వహించారు.

 Prajavani Requests Should Be Dealt With Promptly , Prajavani , Anuraag Jayanti-TeluguStop.com

ఈ సందర్బంగా ప్రజల నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల ( Sircilla )అలాగే హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పెండింగ్ ఉన్నాయి? వాటికి సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో సుప్రీం, హైకోర్టు ల కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? వాటి వివరాలు ఇవ్వాలని, ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు.ప్రజావాణికి మొత్తం 29 దరఖాస్తులు వచ్చాయి.

రెవెన్యూ శాఖకు 17, డీపీఓకు 5, సర్వే, డీఎం హెచ్ ఓ, సెస్, నీటి పారుదల, ఎంపీడీఓ, సిరిసిల్ల మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి.ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జెడ్పీ సీఈవో ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube