కంటిచూపు లేనివాళ్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నా ఎన్నో అవరోధాలు, ఆవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి.అయితే తెలుగు బిడ్డ కట్టా సింహాచలం( Katta Simhachalam ) మాత్రం తన సక్సెస్ స్టోరీతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
సంకల్పంతో కష్టపడితే లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదని కట్టా సింహాచలం ప్రూవ్ చేశారు.అంధత్వాన్ని జయించి అత్యున్నత స్థాయికి చేరుకున్న ఇతని సక్సెస్ స్టోరీ( Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పేదరికం వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న కట్టా సింహాచలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని గూడపల్లి గ్రామానికి చెందినవారు.2019 సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ లో కట్టా సింహాచలం 457వ ర్యాంక్ సాధించారు.విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా( Assistant Collector ) ఆయన బాధ్యతలు నిర్వహించారు.ఎన్నో కష్టాలను అధిగమించిన కట్టా సింహాచలం సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కట్టా సింహాచలం తండ్రి పాత గోనెసంచుల వ్యాపారం చేసేవారు.అమ్మ గర్భవతిగా ఉన్న సమయంలో సరైన పోషకాహారం లభించలేదని అందువల్లే నేను అంధుడిగా( Blind ) పుట్టానని ఆయన అన్నారు.పేదరికంతో పోరాడుతూ ఆంధ్రా బ్రెయిలీ స్కూల్ లో( Andhra Braille School ) చదువుకున్నానని కట్టా సింహాచలం చెప్పుకొచ్చారు.2008 సంవత్సరంలో నాన్న దూరమయ్యారని ఆయన కామెంట్లు చేశారు.ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయని ఆయన చెబుతున్నారు.నేను డాక్టర్ కావాలని అనుకున్నానని 2014లో పరీక్షలు రాసినా కలెక్టర్ అయ్యే అవకాశం కొద్దిలో మిస్ అయిందని 2016లో ఐ.ఆర్.ఎస్ కు ఎంపికయ్యానని ఆయన అన్నారు.నేను ఐఏఎస్ చేయగలనని ఎప్పుడూ అనుకోలేదని నేను అనుకున్నది జరిగితే సమాజానికి సందేహం ఇవ్వగలనని కట్టా సింహాచలం చెప్పుకొచ్చారు.
కట్టా సింహాచలం సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కట్టా సింహాచలం కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.