రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో క్యూఆర్ స్కాన్, వాట్సాప్ నెంబర్ గలా పోస్టర్ అటించబడి ఉన్నాయని,పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఒక్కరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్టేషన్ మీద మీకు ఉన్న అభిప్రాయన్నీ తెలిపి రేటింగ్ ఇవ్వగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.బుధవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ కి సంబంధించిన పోస్టర్ ను పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లాలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారుల యెక్క పనితీరుకు సంబంధించి మీకు స్టేషన్ మీద ఉన్న అభిప్రాయం, రేటింగ్ ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకరావడం జరిగింది.

మీ మీ మొబైల్ ఫోన్ లో క్యూఆర్ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం తెలపాలని, క్యూఆర్ స్కాన్ సదుపాయం లేని వారు 6303 922 572 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ రూపంలో మీ యెక్క అభిప్రాయం తెలుపవచ్చు అని అన్నారు.మీ మొబైల్ లో ఉన్న క్యూఆర్ స్కానర్ ద్వారా కోడ్ ని స్కాన్ చేయగానే మీ యెక్క మెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలని, లాగిన్ ఐన తరువాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అని అందులో మీ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని మీపెరు మొబైల్ నెంబర్ నమోదు చేసుకోవాలని మీరు దరఖాస్తు ఇస్తే దరఖాస్తు నెంబర్, ఎఫ్ఐఆర్ దగ్గర నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్,దరఖాస్తూ అప్లోడ్ చేసి ,

మీరు ఇచ్చిన దరఖాస్తు పై స్టేషన్ హౌస్ అధికారి, మిగితా సిబ్బంది ఎలా స్పందించారు.పోలీసు స్టేషన్ నందు పరిశుభ్రత, పచ్చదనం,పోలీస్ స్టేషన్ లో ఉన్న వసతులకు సంబంధించి మీ అభిప్రాయం తెలపాలన్నారు.ఇంకా ఏమైనా పోలీస్ స్టేటన్లలో మెరుగుపర్చవలసిన విషయాలకు సంబంధించి అభిప్రాయలు కూడా తెలువచ్చు అని అన్నారు.క్యూఆర్ స్కాన్ ద్వారా,వాట్సప్ మెసేజ్ ద్వారా తెలిపిన మీ అభిప్రాయలను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్, సి.ఐ అనిల్ కుమార్,ఉపేందర్,కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.