రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందుకూరి శ్రీనివాస్ గౌడ్ ( 45 ) అనే గీతా కార్మికుడు బుధవారం ఉదయం 5-00 గంటల ప్రాంతంలో తెగి నేలపై పడిపోయి ఉన్న విద్యుత్ లైన్ వైరు ద్విచక్ర వాహనంకు తగిలి బోల్తాపడింది.ఈ సంఘటన లో ఆయన కుడి చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.
బ్రతుకు దెరువు కోసం శ్రీనివాస్ గౌడ్ ప్రతి రోజు తాటి చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అవసరమైతే కల్లు అమ్ముకొని ఒక వేళ అమ్మకపోతే ఇంటి దగ్గర పెట్టి ఉపాధి హామీ పనులకు వెళ్ళుతుంటాడు అదే ప్రకారం బుధవారం ఉదయం 5-00 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం పై పెద్దవేణి ఎల్లయ్య వ్యవసాయ బావి సమీపంలో తెగి పడి ఉన్న సరఫరా లేని విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనానికి తగిలింది.
దీంతో ద్విచక్ర వాహనం బోల్తా పడింది.
ఈ సంఘటనలో శ్రీనివాస్ గౌడ్ కుడిచేయి విరిగి గాయపడ్డాడు.వెంటనే గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి వచ్చి అతన్ని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ విద్యుత్ సరఫరా లేని విద్యుత్ వైరు తగిలి చేతు విరిగి గాయపడిన అతనికి సెస్ సంస్థ తరుపున ఆర్థీక సహాయం అందించాలని గౌడ్ సంఘం ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.