రాజన్న సిరిసిల్ల జిల్లా : సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా పరిదిలో మహిళల,విద్యార్థినిల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
మహిళలకి ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో , ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం జిల్లాలో షి టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతున్నరు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫెక్ ఐడి లతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్ లు క్రియేట్ చేసి,లేదా మహిళల సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేసి అసభ్యకర వీడియోలు, ఫోటిస్ పంపుతూ మహిళలు, విద్యార్థినుల వేధింపులు గురి అవుతున్న పిర్యాదులు ఎక్కవ వస్తున్నాయని,అలాంటి వేధింపులకు పాల్పడే పోకిరిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలను,మహిళలను వేధించినా, అసభ్యంకర ఫొటోలు, వీడియోలు పంపిన,
సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇలాంటి స్సమస్యలపై జిల్లా పోలీస్ నిఘా ఉంటుందని ఇలాంటి సమస్యలపై మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షీ టీమ్ కి పిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళలు ,విద్యార్థినులు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, లేదా షీ టీం నెంబర్ 87126 56425 కి పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.