రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత చూసి కాంగ్రెస్ పార్టీ లో ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav is a former MPTC ) ఆధ్వర్యంలో చేరానని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి కి చెందిన అందే కవిత అన్నారు.గొల్లపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ను కొండూరు గాంధీ రావు ప్రారంబించారు.
అనంతరం అందే కవిత కు కొండూరు గాంధీ రావు( Kondur Gandhi Rao ) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నర్సయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిషెట్టి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ ఏలూరి రాజయ్య, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహిబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డి పేట వార్డు సభ్యులు పందీర్ల శ్రీనివాస్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,గొల్లపల్లి గ్రామ శాఖ అద్యక్షులు గుడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు