ఏపీలోని టీడీపీ నేతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పచ్చ దొంగల ముఠా గ్రామాల్లోకి చొరబడుతోందని విమర్శించారు.
దొంగల ముఠా అధికారంలోకి వస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయోనని సజ్జల అన్నారు.ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని పేర్కొన్నారు.గతంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
వ్యక్తిగత సమాచారం తీసుకుని వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారన్న సజ్జల ఓటర్ ఐడీ కార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు.ఈ క్రమంలోనే అంతర్జాతీయ ముఠాకు, ఈ ముఠాకు తేడా ఏమీ లేదని పేర్కొన్నారు.
సుమారు ఐదుకోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్న సజ్జల సేవామిత్ర పేరుతో అన్ని వివరాలు సేకరిస్తున్నారన్నారు.ఈ క్రమంలో పచ్చ దొంగల ముఠాపై ఏపీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.