ఖబ్రస్తాన్ లో పూల చెట్ల ఏర్పాటు చేయాలని, త్వరలో ఈద్గా నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాను - ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల ముస్లింలకు చెందిన ఖబ్రస్థాన్ లో పూల మొక్కలు పెంచడం కోసం బక్రీద్ పర్వదిన సందర్భంగా ఈద్గా ను,ఖబ్రస్తాన్ పరిశీలించడం జరిగింది.ఖబ్రస్తాన్ లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లను తొలగించి వాటి స్థానంలో గన్నేరు, మందార చెట్లు పెట్టడం వల్ల తుమ్మ చెట్లు పెరగకుండా ఉంటుందని వర్షాకాలం కావడం వల్ల ఇప్పుడు పూల మొక్కలు పెట్టడం వల్ల అతి తొందరగా చెట్లు ఎదుగుతాయని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ కు సూచించారు.

 I Will Soon Send Proposals To The Government For The Construction Of Eidgah Oggu-TeluguStop.com

తుమ్మ చెట్లను తొలగించి వెంటనే పూల మొక్కలు పెట్టడం కోసం గుంతలు తీయించాలని నరేష్ కు సూచించారు.మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట ఎన్ ఆర్ ఈ జి ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కోనేటి నరేష్, జామే మజీద్ కమిటీ వైస్ చైర్మన్ లాల్ మహమ్మద్, డీలర్ బాబా, రఫిక్ తదితరులు ఉన్నారు.

బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదర సోదరీమణులకు స్థానిక తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube