వైరల్ వీడియో: ఓరినాయనో.. అది టీ కాదు విషం.. తాగితే పరలోకానికి ఫ్రీ ఎంట్రీ..

మనలో కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం.ఇక వారికి ఎలాంటి పనుల్లో విసిగి వచ్చిన లేదా తలనొప్పిగా అనిపించినా ముందుగా వారికి గుర్తు వచ్చేది టీ తాగడం.

 Pepsi Chai Viral On Social Media, Viral Video, Social Media, Tea Lovers, Pepsi-TeluguStop.com

అయితే వివిధ రకాలుగా టీ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అంతేకాకుండా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వంటలు చేయడం, స్నాక్స్ చేయడం లాంటివి ఈ మధ్య వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాము.

ఉదాహరణకు మ్యాగీతో సమోసాలు చేయడం., బిస్కెట్లతో పకోడీ చేయడం లాంటి వీడియోలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూన్నాయి.

ఇక తాజాగా ఒక వ్యక్తి టీ చేసే విధానాన్ని చూసి టి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి టీ తయారు చేసేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకొని ముందుగా స్టవ్ పై టీ పాత్రను పెట్టి అందులో టీ పొడి ,పాలు, చక్కెర వేస్తాడు.ఇంతవరకు అంతా బాగున్నా.కానీ., ఒక్కసారిగా ఆ వ్యక్తి స్టవ్ పక్కనే ఉన్న పెప్సీ బాటిల్ ని తీసుకొని టీ పాత్రలో పోస్తాడు.ఆ తర్వాత వాటన్నిటిని బాగా ఉడికించిన తర్వాత ఆ వేడివేడి టీ ను గ్లాసులలో వేసి కస్టమర్లకు అందించడం మనం చూడవచ్చు.

ఇక ఈ వీడియో చూసిన కొంతమందిని నెటిజన్స్ ఇది టీ కాదు విషం అంటూ., ఇది ఎక్కడి టీ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది టీ లవర్స్ ఇలాంటి టీ చూస్తే మళ్లీ ఎప్పుడు కూడా టీ తాగాలని కూడా అనిపించదు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube