కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానంలో చిన్న పొరపాటు కూడా పెను విపత్తుకు దారి తీస్తుంది.అందువల్ల, విమానయాన సంస్థలు( Airlines ) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాయి.
స్వల్ప ఉల్లంఘన కూడా ఆమోదయోగ్యం కాదు విమానంలో.చిన్న, పెద్ద అని విమానంలో నిబంధనలు పాటించని వారెవరైనా అందరూ ఇబ్బంది పడతారు.
దీనికి తాజా ఉదాహరణ వైరల్ అవుతున్న వీడియో అని చూపొచ్చు.
కొలంబియాలోని లతమ్ ఎయిర్ లైన్స్ ( Latham Airlines in Colombia )విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రయాణీకులు బయలు దేరే ముందు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు.అయితే దీనికి ఓ పదేళ్ల బాలుడు ససేమిరా అన్నాడు.
ఎంత మాట్లాడినా., చెప్పిన వినడానికి నిరాకరించాడు.
హన తండ్రి మాటలు పట్టించుకోకుండా నానా రభస చేసాడు.ఈ నేపథ్యంలో విమానం దాదాపు గంట ఆలస్యంగా బయలుదేరింది.
అయితే, ఆ సమయంలో ఇతర ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.వారిని ఇక్కడే వదిలివేయాలని డిమాండ్ చేశారు.
దీంతో సిబ్బంది కూడా విసిగిపోయి సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు.దాంతో వారు తండ్రీ కొడుకులను ఇద్దరినీ అక్కడే విమానం నుండి దించేశారు.
వీడియో చూసిన చాలా మంది బాలుడి తండ్రిని తప్పు పట్టారు.కొడుకును ఇంత మొండిగా పెంచినందుకు అతనిని తప్పు బడుతున్నారు.ఇలాంటి వారికి ఇలానే చేస్తే బుడ్డి వస్తుందంటున్నారు కొందరు నెటిజన్స్.ఇలా ఎవరైనా ప్రయాణికుడు మాట వినకపోతే ఇలా వదిలేయాలని, అప్పుడే ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇలా వివిధ కామెంట్ల కారణంగా వీడియో మరింత వైరల్ గా మారుతోంది.