చిరంజీవి నటన గురించి, ఆయన డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి తన ప్రతి సినిమాలో ఎలాంటి డ్యాన్సులు చేసి ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించారో అందరికీ తెలిసిన విషయమే.
టాలీవుడ్ లో మంచి డ్యాన్స్ చేసే హీరోగా సక్సెస్ ఫుల్ గా కొనసాగాడు.చిరంజీవి డ్యాన్సులపై శ్రద్ధ పెట్టారు కానీ ఆయన డ్యాన్స్ చేసే పాటలకు స్వయంగా తానే పాట పాడుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు.
నిజానికి ఏ హీరో కూడా ఆ ప్రయత్నం చేయానుకోరు.కానీ.
చిరంజీవితో ఆ ప్రయత్నం తొలిసారి చేయించారు దర్శకుడు సురేశ్ కృష్ణ.దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయనే స్వయంగా సురేశ్ కృష్ణ వెల్లడించాడు.
1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో చిరంజీవి తొలిసారి పాట పాడారు.అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ పాట.తాను అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పటి నుంచీ చిరంజీవితో పరిచయం ఉన్నట్లు చెప్పాడు.బాలచందర్ దగ్గర అసిస్టెంట్ గా రుద్రవీణ సినిమాకు పని చేశాడు.
ఆ తర్వాత 9 ఏళ్లకు తన దర్శకత్వంలో చిరంజీవిని డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది.సినిమాలో ఫస్టాఫ్ లో చిరంజీవి మాస్టర్ గా పెద్ద తరహాలో స్టూడెంట్స్ మధ్యే ఉంటారు.
సెకండాఫ్ వస్తేనే గానీ కథలో చిరంజీవి మాస్ యాక్షన్ ఉండదు.ఈ సమయంలో ఫస్టాఫ్ లో ఫ్యాన్స్ కు కిక్కివ్వాలంటే ఏదైనా ప్రత్యేకత జోడించాలనుకున్నాడు దర్శకుడు.
దీంతో చిరంజీవితో పాట పాడించాలని భావించాడు.అదే మాట అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవాకు చెప్తే ఓకే అన్నారు.
కానీ చిరంజీవి నో చెప్పాడు.ఎంత చెప్పినా పాడననే అన్నారు.
తొలుత లైట్ తీసుకున్న దర్శకుడు మరికొంత సమయం తర్వాత మళ్లోసారి ఈ పాట గురించి చెప్పాడు.సినిమా కథలోని ఇంటెన్సిటీ పాట పాడాల్సిన సందర్భాన్ని మళ్లీ వివరించాడు.దీంతో కొత్తగా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన కూడా భావించారు.పాట పాడేందుకు సరే అని చెప్పాడు.ట్యూన్, సాహిత్యం తీసుకుని చక్కగా పాట పాడేశారు.ఆ పాట అప్పట్లో చాలా స్పెషల్ అయింది.
స్టూడెంట్స్ మధ్య డ్యాన్స్ చేయడం ఆయనే స్వయంగా పాట పాడటం ఫ్యాన్స్, ఆడియన్స్ కు మంచి థ్రిల్ కలిగించిందన్నాడు దర్శకుడు సురేశ్ కృష్ణ.