స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చిన మహేష్ కొడుకు గౌతమ్.. ఎమోషనల్ అయిన నమ్రత!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కొడుకు గౌతమ్( Gautam ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం స్టడీని కొనసాగిస్తున్న గౌతమ్ సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

 Gautam Ghattamaneni Stage Performance London Namratha Post Viral Details, Gautha-TeluguStop.com

గౌతమ్ చెల్లెలు సితార( Sitara ) ఈ వయసుకే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు తరచూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఈ వయసుకి ఈ చిన్నది హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.

గౌతమ్ కి కూడా భారీగా అభిమానులు ఉన్నప్పటికీ గౌతమ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే గౌతమ్ తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇందులో భాగంగానే తాజాగా స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు.ఈ క్రమంలోనే నమ్రత( Namrata ) ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది.ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా గౌతమ్ చిన్న వయసులో మహేశ్ హీరోగా నటించిన వన్ నేనొక్కడినే( One Nenokkadine ) సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు.రీసెంట్‌గా ప్లస్ టూ పూర్తి చేసాడు గౌతమ్.అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఇప్పుడు లండన్‌లో ఒక నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది.కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లే.

ఇక రెండు మూడేళ్ల తర్వాత గౌతమ్ ఎంట్రీ కన్ఫామ్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube