టాలీవుడ్ నటుడు హీరో ఉపేంద్ర( Hero Upendra ) నటించిన దర్శకత్వం వహించిన సినిమా ఏ.1998లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ఈ సినిమాలో ఉపేంద్ర సరసన చాందిని( Chandni ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.అప్పట్లో ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.అయితే ఈ సినిమా విడుదల అయ్యే దాదాపు 25 ఏళ్ళు అయిన సందర్భంగా తాజాగా ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్( Uppi Creations, Chandu Entertainment ) బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చాందిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.ఉపేంద్రతో నటించిన ఏ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.నేను చదువుకుంటున్న రోజుల్లోనే ఈ మూవీ ఛాన్స్ నాకు దక్కింది.ఈ పాత్ర కోసం చాలామంది పోటీపడ్డారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండటంతో చాలామందిని ఆడిషన్స్ చేశారు.
కానీ తెలిసిన వారి నుంచి నా ఫోటోలు ఏ సినిమా మేకర్స్ చేతికి వెళ్లాయి.ఆ సమయంలో నన్ను చూడకుండానే వారు సెలక్ట్ చేశారు అని చెప్పుకొచ్చింది చాందిని.

అనంతరం తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.వివాహ బంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది.నా పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు.అది మన చేతుల్లో లేదు.దానిని దేవుడు నిర్ణయించాలి.పెళ్లి అనేది నేను అద్భుతమని అనుకుంటాను.
నాకు తెలిసి ప్రేమతో ఉన్న అరెంజ్ మ్యారేజ్లు బాగుంటాయి అని చాందిని తెలిపింది.ఈ సందర్భంగా చాందిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ఈమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది.