శాన్‌ఫ్రాన్సిస్కో కంటే బెంగళూరే బెటర్.. మరీ ఇంత మెగా చీపా, ఎన్ఆర్ఐ ట్వీట్స్ వైరల్

సరళీకృత ఆర్ధిక విధానాలు, సంస్కరణలు, ప్రపంచీకరణ ఫలితంగా భారత్‌ ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోంది.రానున్న రోజుల్లో చైనా, అమెరికాలకు( China , America ) గట్టిపోటీ ఇవ్వాలని కృత నిశ్చయంతో ఉంది ఇండియా.

 Indian-origin Entrepreneur Shares Perks Of Living In Bengaluru Over San Francisc-TeluguStop.com

మనదేశంలోని కీలక నగరాలు సైతం ఇప్పుడు అత్యున్నత ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ సిటీలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి వలస వెళ్లిన కొందరు తిరిగొచ్చి చూసి.

దేశంలో వచ్చిన మార్పును నమ్మలేకపోతున్నారు.తాజాగా ఓ ఎన్ఆర్ఐకి అదే పరిస్ధితి ఎదురైంది.

స్టార్టప్ ఎకోసిస్టమ్( startup ecosystem ) విషయానికి వస్తే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోతో బెంగళూరు( Bangalore with San Francisco ) సమానంగా ఉందని ఆయన చెప్పారు.టెక్నాలజీ, స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ , ఉన్నత విద్య వంటి రంగాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా దూసుకుపోతోందన్నారు.

తాను ఏడేళ్ల తర్వాత భారతదేశానికి రావడం ఇదే తొలిసారని ది రెసిడెన్సీ వ్యవస్థాపకుడు , భారత సంతతికి చెందిన హర్దీప్ గంభీర్ తెలిపారు.రానున్న రోజుల్లో శాన్‌ఫ్రాన్సిస్కోను బెంగళూరు అధిగమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu America, Bangaloresan, Bengaluru, China, Gambhir, Indianorigin, San Franc

తాను బెంగళూరులో ఉన్న రోజులను, గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్న గంభీర్( Gambhir ) .భారతదేశంలో నివసించడం , ఇతర సౌలభ్యాలను ప్రస్తావించారు.ఇక్కడ ఆహారం, కిరాణా సామాగ్రిని 10 నిమిషాలలో డెలివరీ చేయొచ్చని చెప్పారు.భారతదేశంలో చాలా తక్కువ మొబైల్ టారిఫ్‌‌లు ఉన్నాయని.కేవలం 3.59 డాలర్లకే తాను నెలరోజుల పాటు అపరిమిత కాలింగ్‌, రోజుకు 1 జీబీ డేటాను పొందుతున్నానని హర్దీప్ వెల్లడించారు.ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి శాన్‌ఫ్రాన్సిస్కోలో లైమ్, వీవో, బేవీల్స్ బైక్‌లు ఉంటే.బెంగళూరులో యులు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయని గంభీర్ చెప్పారు.

Telugu America, Bangaloresan, Bengaluru, China, Gambhir, Indianorigin, San Franc

బెంగళూరులో మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక నెలకు 2,500 డాలర్లు ఖర్చు చేస్తే.బెంగళూరులో కేవలం 900 డాలర్లతో నెలరోజులు జీవించవచ్చని .బెంగళూరులో జీవితం మెగా చీప్ అని గంభీర్ రాసుకొచ్చారు.అన్నింటికీ మించి బెంగళూరులో అద్భుతమైన వాతావరణం ఉంటుందన్నారు.అయితే నగరంలో దోమలు, అద్దె ఇళ్లకు భారీగా వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్లు తనకు నచ్చలేదని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube