ప్రపంచవ్యాప్తంగా అమితంగా ఇష్టపడే పండ్లలో బొప్పాయి పండు ఒకటి.పల్లెటూర్లలో అయితే ఇంటికో బొప్పాయి చెట్టు ఉంటుంది.ఇక సిటీస్‌లో బొప్పాయి చెట్లను పెంచుకునే స్థలం లేకపోయినా.బయట బొప్పాయి పండ్లను కొనుగోలు చేసి మరీ తింటుంటారు.తియ్యగా, రుచిగా ఉండే బొప్పాయి పండ్లను పెద్దలే కాదు.చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారు.
అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు బొప్పాయి పండ్లను పెట్టొచ్చా.పెట్టకూడదా.
అన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
అయితే బొప్పాయి పిల్లలకు మంచిదే.
బొప్పాయి తినడం వల్ల పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కానీ, పిల్లలకు బొప్పాయిని చాలా మితంగా మాత్రమే పెట్టాలి.
పిల్లల ఆరోగ్యానికి బొప్పాయి పండు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చిన్న పిల్లల్లో కడుపు నొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఆహారం జీర్ణంకాక, నులిపురుగులు ఏర్పడడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి సమస్య ఏర్పడుతుంది.అలాంటి సమయంలో బాగా పండిన బొప్పాయి పండు పిల్లలకు తినిపిస్తే.
కడుపులో నులిపురుగులు పోవడంతో పాటు ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. కడుపు నొప్పి సమస్య దూరం అవుతుంది.
అలాగే పిల్లల్లో విటమిన్ బి లోపం కారణంగా తరచూ నోటి పూత సమస్య వస్తుంటుంది.అయితే ప్రతి రోజు తగిన మోతాదులో పిల్లలకు బొప్పాయి ఇస్తే.శరీరానికి కావాల్సిన విటమిన్ బి అంది నోటి పూత సమస్య రాకుండా ఉంటుంది.ఇక బొప్పాయిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, బొప్పాయి పిల్లలకు పెట్టడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి.జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి జబ్బుల నుంచి పిల్లలకు రక్షణ లభిస్తుంది.
అయితే పిల్లల్లో శ్వాస సమస్యలు, ఆస్తమా, అలర్జీ సమస్యలు ఉన్నప్పుడు బొప్పాయి పెట్టకపోవడమే మంచిది.ఎందుకంటే, ఈ సమస్యలను బొప్పాయి పండు మరింత రెట్టింపు చేస్తుంది.
అలాగే ఆరోగ్యానికి మంచిది కదా అని పిల్లలకు ఎప్పుడూ కూడా బొప్పాయి పండును అత్యధికంగా పెట్టకూడదు.అలా చేస్తే అనేక సమస్యలు ఏర్పడతాయి.