ఆ కారణంతోనే జబర్దస్త్ మానేశాను... మల్లెమాల వారిపై అవినాష్ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ కమెడియన్ గా ముక్కు అవినాష్( Avinash ) అందరికీ ఎంతో సుపరిచితమే.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

 Mukku Avinash Sensational Comments On Jabardasth Show, Mukku Avinash, Jabardasth-TeluguStop.com

అయితే ఉన్నఫలంగా జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమాన్ని మానేసి అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో సందడి చేశారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత అవినాష్ ఈటీవీలో ఎక్కడ కనిపించలేదు.

ప్రస్తుతం స్టార్ మా లో స్టార్ మా పరివార్, నీతోనే డాన్స్ వంటి కార్యక్రమాలతో పాటు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈయన రీతూ చౌదరి ( Ritu Chowdary ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దావత్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Telugu Bigg Boss, Jabardasth, Mukku Avinash, Mukkuavinash, Ritu Chowdary-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా రీతు చౌదరి ఈయనని ప్రశ్నిస్తూ జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేయడానికి కారణమేంటని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అవినాష్ సమాధానం చెబుతూ జీవితంలో ఎవరైనా ముందుకు వెళ్లాలని కోరుకుంటారు.ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేశానని తెలిపారు.కరోనా సమయంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.అప్పుడు సూసైడ్ కూడా చేసుకోవాలని ఆలోచన వచ్చింది కానీ నాకు బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో సంతోషపడ్డాను అని తెలిపారు.

Telugu Bigg Boss, Jabardasth, Mukku Avinash, Mukkuavinash, Ritu Chowdary-Movie

ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలి అంటే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నిర్వాహకులు మల్లెమాల వారితో నాకు అగ్రిమెంట్ ఉండడం చేత వెళ్లలేని పరిస్థితి అక్కడ నుంచి బయటకు వెళ్లాలి అంటే పది లక్షల రూపాయల ఫైన్ కట్టి వెళ్ళమన్నారుఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచలేదు.అప్పుడు శ్రీముఖి నాకు ఐదు లక్షల సహాయం చేయగా ఇతర ఫ్రెండ్స్ మరో ఐదు లక్షలు ఇచ్చారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ఆర్థిక సమస్యలలో ఉన్న నేను ఆ సమస్యల నుంచి బయటపడ్డానని తెలిపారు.

బిగ్ బాస్ కార్యక్రమం నాకు పునర్జన్మనిచ్చిందని ఈయన వెల్లడించారు.తిరిగి జబర్దస్త్ వెళ్లే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా జీవితంలో ఎవరైనా ముందుకు వెళ్లాలి అనుకుంటారు కానీ వెనక్కి వెళ్లాలనుకోరు అంటూ అవినాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube