ఇండిగో విమానాలు( Indigo Flights ) ఆలస్యాలు, సర్వీస్ సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాయి.ఇటీవల ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళ్లే విమానం నాలుగు గంటలు ఆలస్యం అయ్యింది.
దానికి కారణం ఎక్కువగా ఉష్ణోగ్రత.విమానం లోపలే ప్యాసింజర్లను ఉంచాల్సి వచ్చింది కానీ, ఎయిర్ కండిషన్ సిస్టమ్ మాత్రం పనిచేయలేదు.
దీంతో ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు.
అయితే, ఇబ్బంది పడిన వారు మాత్రమే కాదు సంతోష పడిన వారు కూడా ఉన్నారు.
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్లే విమానం విషయంలో ఓ ప్రయాణీకుడు ఇండిగో సర్వీస్‌ని మెచ్చుకున్నాడు.గమ్యస్థానంలో చెడు వాతావరణం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే( Delhi Airport ) విమానం ఆలస్యమైంది.
ఆ సమయంలో క్యాబిన్ సిబ్బంది నీళ్లు, స్నాక్స్ అందించడమే కాకుండా, టైమ్ పాస్ చేయడానికి ఒక ఫన్ గేమ్ కూడా నిర్వహించారట.ఆ ప్రయాణికుడు తన పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ ణి రెడిట్‌లో పంచుకున్నాడు.
ఎయిర్ కండిషనింగ్ పనిచేసిందని, క్యాబిన్ సిబ్బంది చాలా శ్రద్ధగా చూసుకున్నారని చెప్పారు.ఆ పోస్ట్‌కి కూడా రకరకాల రియాక్షన్లు వచ్చాయి.
కొందరు ఇండిగోని అత్యుత్తమమైన, పరిశుభ్రమైన విమానయాన సంస్థగా ప్రశంసించగా.మరికొందరు వారి సర్వీసులను విమర్శించారు.

ఇండిగో సర్వీస్‌పై వచ్చిన ఫిర్యాదులకు ఓ వ్యక్తి మద్దతు తెలిపారు.ఇతర భారతీయ విమానయాన సంస్థల కంటే ఇండిగోనే( Indigo ) బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.మరొకరు, గత అనుభవాలతో పోల్చితే ఇండిగో సిబ్బంది హాస్పిటాలిటీ ( Hospitality ) మెరుగుపడిందని చెప్పారు.కొంతమంది ప్రయాణికులు విమానం లోపలి పరిశుభ్రతని మెచ్చుకున్నారు గానీ, ప్రయాణికులకు స్వాగతం పలకడం తగ్గిందని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, మరొక వ్యక్తి ఇండిగో ఆఫర్ చేసే భోజనం నాణ్యత గురించి ఫిర్యాదు చేశారు.చిన్న బిస్కెట్, జూస్ లాంటివి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, అవి పెద్దగా టేస్ట్ గా లేవని చెప్పారు.డబ్బులకు తగిన విధంగా ఆహారం లేదని ఆయన అభిప్రాయం.ఈ ఏడాది ప్రారంభంలో, ఉన్నట్టుండి విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం వల్ల ప్రజలు ఇండిగోపై కోపంగా ఉన్నారు.
కమెడియన్ విర్ దాస్, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్‌తో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఇండిగో సర్వీస్‌పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఓ ఘటనలో ఢిల్లీ నుంచి గోవా వెళ్లే విమానంలో విమానం ఆలస్యం అవుతుందని కెప్టెన్ ప్రకటించగా, ఆ ప్రకటన విని కోపంతో ఉన్న ఓ ప్రయాణీకుడు కెప్టెన్‌ని కొట్టారు.ఢిల్లీలో మంచు దట్టంగా ఉండటంవల్ల విమానం టేకాఫ్ కాలేకపోయింది.ఆ కోపంతో ఆయన కో-కెప్టెన్ అనుప్ కుమార్‌ని కొట్టారు.
ఆ తర్వాత పోలీసులు ఆ ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు.ఇలాంటి సమస్యలు ఉన్నా, కొంతమంది ప్రయాణీకులకు ఇండిగోతో మంచి అనుభవాలే ఉన్నాయి.
దీంతో ఇండిగో పేరుకు ఉన్న రిప్యుటేషన్ మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు.