వీడియో: ఇంగ్లాండ్ ఆసుపత్రిలో దెయ్యాలు.. ధైర్యం చేసి వీడియో తీసిన వ్యక్తులు..??

సాధారణంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అనే ఒక అయోమయంలో ప్రజలు ఉంటారు చాలామంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతూ చాలా భయపడుతుంటారు.ఇవి వదిలేసిన ఇళ్లల్లో, పాడుబడ్డ భవనాల్లో, పాత భవనాల్లో ఉంటాయని విశ్వసిస్తారు.

 Ghost Hunter Explores Abandoned Haunted Hospital In England Details, Urban Explo-TeluguStop.com

అలా చాలా ప్రాంతాలను హాంటెడ్ గా( Haunted Places ) ప్రజలు చెప్పుకుంటున్నారు.అయితే ఇలాంటి ప్రదేశాలను అన్వేషించడమే పనిగా పెట్టుకున్నాడు ఓ యూట్యూబర్‌.

“మోక్స్లీస్ పారానార్మల్ వరల్డ్”( Moxleys Paranormal World ) అనే యూట్యూబ్ ఛానెల్‌ యజమాని మోక్స్లీ ధైర్యంగా భయంకరమైన ప్రదేశాలను అన్వేషిస్తున్నాడు.ఇటీవల, అతను ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో ఉన్న మీన్‌వుడ్ పార్క్ హాస్పిటల్‌లో( Meanwood Park Hospital ) తిరిగాడు.

ఈ హాస్పిటల్ పాడుబడ్డది.ఈ భవనంలో ఎవరూ ఉండటం లేదు.

చాలా రోజులుగా ఇది అలానే పడాబడి ఉంది.ఈ భవనం చాలా వరకు భూతాలు నివసించే ప్రదేశంగా పేరుగాంచింది, అక్కడికి వెళ్లడానికి పోలీసులు కూడా భయపడతారని చెబుతారు.

Telugu Devils, England, Ghost Hunter, Ghosthunter, Meanwood Park, Moxley, Nri, U

యూట్యూబ్ ఛానెల్‌లో “ఈ భవనం ఇంతవరకు హాంటెడ్ ప్లేసు అయి ఉంది.పోలీసులు కూడా దాని లోపలికి వెళ్లడానికి భయపడతారు.” అనే టైటిల్‌తో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు.మోక్స్లీ( Moxley ) ఆ భవనంలో తనకు ఎదురైన భయానక అనుభవాలను వివరించాడు.

వీడియోలో మొదట, మోక్స్లీ తన వద్ద ఉన్న పరికరాన్ని చూపిస్తాడు.ఆ పరికరం చుట్టూ చెడు శక్తులు ఉన్నాయని గుర్తించి హెచ్చరిస్తుంది.

ఆ తర్వాత చిన్న చిన్న మెట్లు, కుళ్లిపోయిన ఫర్నిచర్, గోడలపై పగుళ్లు, చెల్లాచెదురుగా ఉన్న వస్తువులతో నిండిన భయంకరమైన ఆసుపత్రి లోపలి భాగాన్ని చూపిస్తాడు.

బయట నుంచి డ్రోన్‌తో ఆసుపత్రి దృశ్యాలను షూట్ చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడికి వస్తారు.

కానీ వారు మోక్స్లీతో మాట్లాడకుండా, భవనంలోకి వెళ్లకుండా, దూరం నుంచి అతనిని పరిశీలించి వెళ్ళిపోతారు.పోలీసులు తనను చూశారని గమనించిన మోక్స్లీ, వారు తన దగ్గరకు రావడానికి భయపడ్డారని అనుకుంటాడు.

Telugu Devils, England, Ghost Hunter, Ghosthunter, Meanwood Park, Moxley, Nri, U

మీన్‌వుడ్ పార్క్ ఆసుపత్రిని 1760ల్లో నిర్మించారు.1919లో దీనిని మార్చి, పిచ్చి ఉన్న వారి కోసం ఆశ్రమంగా మార్చారు.అక్కడ నివసించిన వారు కఠినమైన నియమాలు, చిన్న తప్పులకు కూడా కఠినమైన శిక్షలు అనుభవించారని చెబుతుంటారు.ఈ ఆసుపత్రిలో రాత్రిపూట పెద్ద మెట్ల దగ్గర ఒక స్త్రీ ఆత్మ తిరుగుతుందని సిబ్బంది, రోగులు కూడా చెప్పారు.

ఆసుపత్రిని అన్వేషిస్తున్నప్పుడు, మోక్స్లీ కూడా అడుగుజాడల శబ్దాలు, ఆడ వ్యక్తి చీర కదలికల చప్పుడు వింటున్నానని అనుకున్నాడు.

Telugu Devils, England, Ghost Hunter, Ghosthunter, Meanwood Park, Moxley, Nri, U

అత్యాధునిక సెన్సార్‌లు కలిగిన స్మార్ట్‌ఫోన్ యాప్‌లను ఉపయోగించి, ఆసుపత్రిలో భయంకరమైన శక్తి ఉందని మోక్స్లీ గుర్తించాడు.ఒక భయంకరమైన కారిడార్‌లో, అతని పరికరాలలో ఒకటి చాలా చెడు శక్తిని( Negative Energy ) సూచించే భయానకమైన సందేశాన్ని అతనికి ఇచ్చింది.ఆ స్త్రీ శరీరం ఖననం చేయబడిన ప్రదేశాన్ని తవ్వమని ఆ స్వరం మోక్స్లీకి చెప్పింది.

అక్కడ తవ్వకం ప్రారంభించిన గుర్తులు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా, ఆ యాప్ ఫ్లోర్‌బోర్డుల కింద ఏదో లేదా ఎవరో ఖననం చేయబడి ఉండవచ్చని సూచించింది.

అయితే, తేమ, పురుగుల కారణంగా ఫ్లోర్‌బోర్డులు బలహీన పడి, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది.మోక్స్లీతో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఆసుపత్రిలోని మరొక ప్రాంతాన్ని అన్వేషించి, అక్కడ జరిగిన భయంకరమైన అనుభవాలను పంచుకున్నాడు.

వీటి వల్ల మొత్తం అన్వేషణ చాలా భయానకంగా మారింది.వీళ్ల వీడియోను ఈ లింక్ ఘజ్ https://youtu.be/Lg1SlHXsVHY?si=77uMIztR5P9UzD_8 పై క్లిక్ చేసి చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube