సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్క హీరో కూడా సంక్రాంతి( Sankranti ) పండుకొని టార్గెట్ చేస్తూ ఆ పండుగకి ఎక్కువగా సినిమాలు విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు.అందుకే సినీ క్యాలెండర్లో ఎన్ని పండగ సీజన్లు ఉన్న సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పాలి.
భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాయాలన్నా అగ్ర తారలంతా మొగ్గు చూపేది ఈ పండగ సీజన్ వైపే.సంక్రాంతి పండుగకు సినిమా విడుదల చేయడం కోసం దాదాపు 7, 8 నెలల ముందు నుంచి ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు.
అలా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ బరిలోకి దిగడానికి చాలామంది హీరోలు క్యూలో ఉన్నారు.అయితే ఈ సంక్రాంతి లోపు వచ్చే పండుగలకు కూడా కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.
కానీ కొందరు స్టార్ హీరోలు సంక్రాంతి నే టార్గెట్ గా చేసుకొని అందుకు తగ్గట్టుగా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.

ప్రతి ఏడాదిలాగే వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.మరి వచ్చే ఏడాది ఏఏ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు అన్న విషయానికి వస్తే.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.
( Vishwambhara ) ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర.మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకున్నా డిసెంబరు కల్లా గ్రాఫిక్స్ పనుల్ని ముగించి జనవరి నాటికి సినిమాని సిద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అలాగే టాలీవుడ్ హీరో వెంకటేష్( Venkatesh ) అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించి చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.ఆగస్టులో మొదలు కానున్న ఈ ప్రాజెక్ట్ పైనా అందరిలోనూ ఒక నమ్మకం కనిపిస్తోంది.ఈ ఏడాది సంక్రాంతికి ఈగల్ తో( Eagle ) బాక్సాఫీస్ ముందు జోరు చూపించాలనుకున్నారు రవితేజ.
( Ravi Teja ) కాని పండగ బరిలో రద్దీని తగ్గించడం కోసం ఆఖరి నిమిషంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు.ఆయన భాను భోగవరపు దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ కాంబోని అధికారికంగా ప్రకటించిన రోజే 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చెప్పేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్.ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలు కాగా.ఈ నెలాఖరు నుంచి రవితేజ సెట్లోకి అడుగు పెట్టనున్నారని తెలిసింది.అన్నీ అనుకున్నట్లుగా సాగితే రవితేజ వేగానికి నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ప్రభాస్( Prabhas ) నటించిన కల్కి సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సినిమా తరువాత వచ్చే ఏడాది రాజాసాబ్ సినిమా( Rajasaab ) సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
త్వరలో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలన్న ఆలోచన చిత్ర వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఇదే విషయమై ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను ప్రశ్నించగా సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటే ప్రభాస్‌కు తప్పకుండా ఒక బెర్తు ఉంటుందని బదులిచ్చారు.
అలాగే హీరో నాగార్జున( Nagarjuna ) సంక్రాంతి సెంటిమెంట్‌ను బాగా అనుసరిస్తున్నారు.నాగార్జున కూడా వచ్చి చేయడానికి సంక్రాంతి పండుగకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సోలోగా చిత్రం పట్టాలెక్కించకున్నా.నా సామిరంగ’ తరహాలో మరో సినిమాని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ముగ్గుల పండగ బరిలో నిలిపినా ఆశ్చర్యపోనవసరం లేదన్న సంకేతాలు అందుతున్నాయి.
ఇప్పుడు దీనికి తగ్గట్లుగా తెర వెనుక కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.








