చూడగానే కన్నీళ్లు వచ్చాయి.. దండం పెట్టేసిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!

రేణు దేశాయ్ ( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ఈమె పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన తన కుమారుడు అకీరా నందన్ ( Akira Nandan ) ను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారు.

 Renu Desai Emotional Post On Akira And Pawan Kalyan Video,renu Desai, Pawan Kaly-TeluguStop.com

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈమె చేసే పోస్టులపై పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లు  ఆమెను కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

తిరిగి అన్నయ్య వద్దకు వచ్చేయొచ్చు కదా వదినమ్మ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మీరు అన్ లక్కీ అంటూ ఈమె గురించి కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులపై మండిపడుతున్నారు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నటించిన జానీ సినిమాలో ఒక సన్నివేశాన్ని ఎడిట్ చేశారు.ఇందులో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని చూస్తూ నాకు నీలాంటి కొడుకు పుట్టాలి అంటూ చెప్పే సన్నివేశాన్ని ఎడిట్ చేశారు.అకిరా, పవన్ కళ్యాణ్ వీడియోలను ఎడిట్ చేసి అచ్చం నాన్నలానే అని చూపించేలా వీడియోని ఉంది.ఇక ఈ వీడియో పై రేణు దేశాయ్ స్పందిస్తూ.ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యాను.ఆనందభాష్పాలు వచ్చాయి థాంక్యూ సో మచ్ అంటూ రెండు చేతులు జోడిస్తూ దండం పెడుతున్న ఎమోజిని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube