కరోనా వైరస్.2020 సంవత్సరం అంతా వణికించేసింది.ఎన్నో లక్షలమంది ప్రజలను ఈ కరోనా వైరస్ బలితీసుకుంది.ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రులపాలయ్యారు.ఎక్కడో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించి మనుషులను బలి తీసుకుంది.ఇక ఇప్పుడు ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్ అనే అప్డేట్ వర్షన్ వచ్చింది.
ఈ అప్డేట్ కరోనా చాలా డేంజర్.ఇక అలాంటి కరోనా వైరస్ స్ట్రెయిన్ ని అడ్డుకొనేందుకు మళ్లీ కర్ఫ్యూ పెట్టొచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్ ని అడ్డుకొనే చర్య ల్లో భాగంగా అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించుకోవచ్చ ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.ఎక్కడ కూడా ఎక్కువమంది కలిసి ఉండకూడదని.
అలా ఉండకుండా పరిమితులు విదించుకోవచ్చ ని.అంతేకాకుండా మార్కెట్లు కూడా సూచించిన సమయంల్లో నే పని చేసేలా చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఇప్పటి దేశంలోకి అడుగుపెట్టింది.ఈ మేరకునే కరోనా వైరస్ స్ట్రెయిన్ ను అడ్డుకునేందుకు సరికొత్తగా రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించవచ్చని కేంద్రం పేర్కొంది.అంతేకాదు విద్య, సాంస్కృతిక, మత సంబంధ కార్యక్రమాల్లో సమావేశపు మందిరాల సామర్థ్యంలో గరిష్ఠంగా 50% మంది మాత్రమే ఉండాలని ఉతర్వులు ఇచ్చింది.కాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైజర్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కూడా అనుమతి ఇచ్చింది.
కాగా ఈ స్ట్రెయిన్ కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆంక్షలు ఈ నెల 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది.