మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం లో ప్రభుత్వం, ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటుంటే .
ఏపీ ఎన్నికల అధికారి మాత్రం మార్చిలోపు ఎన్నికలు నిర్వహించి , ఆ తర్వాత పదవీ విరమణ చేయాలని చూస్తున్నారు.ఈ వ్యవహారం కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఇంకా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సిఎస్ ఎస్ ఈ సి ని కోరారు.అలా కోరిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది .ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ప్రకటించారు.మొత్తం నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జనవరి 23వ తేదీన తొలి దశ, 27వ తేదీన రెండో దశ ,31 వ తేదీన మూడో దశ ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.ఫిబ్రవరి 5 ,9 ,13 ,17న రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్న ట్లు ఎస్ ఈసీ తెలిసింది.
తొలిదశ :
నోటిఫికేషన్ జారీ 23, నామినేషన్ల స్వీకరణ 25, నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ 27, నామినేషన్ల పరిశీలన 28, నామినేషన్ల ఉపసంహరణ జనవరి 31, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5.
![Telugu Aditya Nath Das, Ap, Apnimmagadda, Jagan, Ys Jagan-Telugu Political News Telugu Aditya Nath Das, Ap, Apnimmagadda, Jagan, Ys Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/01/AP-Municipal-Gram-Panchayat-Elections-Schedule.jpg)
రెండో దశ :
నోటిఫికేషన్ జారీ 27, నామినేషన్ల స్వీకరణ జనవరి 29, నామినేషన్ సమర్పణకు చివరి రోజు జనవరి 31, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 1, నామినేషన్ ల ఉపసంహరణ ఫిబ్రవరి 4, ఎన్నిక పోలింగ్ ఫిబ్రవరి 9.
మూడో దశ :
నోటిఫికేషన్ జారీ జనవరి 31, నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 2, నామినేషన్ల సమర్పణకు చివరి రోజు ఫిబ్రవరి 4, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 5, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 8, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 13.
నాలుగో దశ :
నోటిఫికేషన్ జారీ ఫిబ్రవరి 4, నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 6, నామినేషన్ సమర్పణ కు చివరి రోజు ఫిబ్రవరి 8, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 9 , నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 12, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 17.