తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై గులాభి దళం దండయాత్ర మొదలైనట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.ఇప్పటి వరకు ఈటల విషయంలో పెదవి విప్పని నేతలు సైతం గత వారం నుండి వరుసపెట్టినట్లుగా విమర్శలు చేస్తుండటం ఈ వార్తలుకు బలాన్ని చేకూరుస్తున్నాయట.
ఇకపోతే నిన్న హరీశ్ రావు కూడా ఈటల వ్యవహారంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వామనరావు హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు కొంత కాలం క్రితం మాయం అయ్యి, ఈ మధ్యనే పోలీసుల చేతికి చిక్కిన సంగతి గమనించే ఉంటారు.
ఇక ఈటలకు పుట్ట మధు ప్రధాన అనుచరుడనే ప్రచారం జరిగింది.కాగా ఈ మధ్య కాలంలో తెరవెనక రాజకీయాల్లో ఏం మాయ జరిగిందో తెలియదు గానీ చివరికి పుట్ట మధు కూడా రూటు మార్చి ఈటల పై విమర్శలు గుప్పిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై ఈటల చేసిన విమర్శలను ఖండిస్తూ దొరల పాలనను, ఆయన కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అయినా నీమీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం అని కారు సారు హమీ ఇచ్చారా, వామన రావు హత్యలో నీ ప్రమేయం లేదని చెప్పినారా ఏంది మధు సడెన్‌గా తెరమీద కుప్పిగంతులు వేస్తున్నావు అంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారట ఈ వ్యవహారం తెలిసి.