ఇక అసెంబ్లీ లో జగన్ అడుగుపెట్టరా ? ఇలా డిసైడ్ అయ్యారా ? 

వైసిపి అధినేత,  మాజీ సీఎం జగన్( Ex CM Jagan ) గురించి ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలు జరుగుతోంది .ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే ఇక ఈ ఐదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదన్నట్లుగా ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతుంది.

 What Is Ysrcp Jagan Strategy On Andhra Assembly Details, Ap Elections, Ap Govern-TeluguStop.com

నిన్నటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) ముగిశాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.

జగన్ తో పాటు , మరో పదిమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.

దీంతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా వైసిపి దక్కించుకోలేకపోయింది.

వైసిపి ఎమ్మెల్యేల( YCP MLAs ) సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో ,అసెంబ్లీకి హాజరైనా, అధికార పార్టీ తమను అవహేళన చేసే విధంగా,  రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ అంచనా వేస్తున్నారు.అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజర య్యే కంటే జనాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిదనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లుగా అర్థం అవుతుంది.

Telugu Ap Assembly, Ap, Virupaksha, Ycp Mlas, Ys Jagan, Ysjagan, Ysrcp-Politics

గత వైసిపి( YCP ) ప్రభుత్వ పాలన గురించి కచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పెడతారని , తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారని, వైసీపీ తరఫున గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉండదని, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవారు కావడం, గతంలోనూ ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొంతమంది ప్రస్తుతం గెలిచినా,  వారిలో గట్టిగా మాట్లాడే వాళ్ళు లేకపోవడం వంటివన్నీ జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telugu Ap Assembly, Ap, Virupaksha, Ycp Mlas, Ys Jagan, Ysjagan, Ysrcp-Politics

ఇటీవల జరిగిన ఎన్నిక ల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పులివెందుల, ఆర్.మత్య లింగం అరకు, ఎం విశ్వేశ్వర రాజు పాడేరు, టి.చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం, బి శివ పసాద్ రెడ్డి దర్శి , దాసరి సుధా బద్వేల్, ఎం అమర్నాథ్ రెడ్డి రాజంపేట, వై బాలనాగిరెడ్డి మంత్రాలయం, బి విరూపాక్షి ఆలూరు, పి ద్వారకానాథ రెడ్డి తంబళ్లపల్లి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు లు విజయం సాధించారు.  వీరిలో జగన్,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారు మినహా మిగిలిన వారికి అధికార పార్టీ విమర్శలను తిప్పుకొట్టే అంతటి వాయిస్ లేకపోవడంతో,  జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడమే మంచిదనే అభిప్రాయానికి రావడానికి కారణమట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube