గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇదే.. ఆ రెండు పండుగలే టార్గెట్ అంటూ?

చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్( game changer ) ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై మూడు సంవత్సరాలు కావడంతో ఈ సినిమాను ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Producer Dil Raju Clarity About Game Changer Movie Release Date Details Here , G-TeluguStop.com

అయితే నిర్మాత దిల్ రాజు ( Produced Dil Raju )వైపు నుంచి ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది.

కుదిరితే దీపావళికి గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేయాలని ఆ సమయంలో రిలీజ్ సాధ్యం కాకపోతే క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు భోగట్టా.

దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్2 సినిమా( Indian2 movie ) ప్రమోషన్స్ పనులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా ప్రకటనలు చేయలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దీపావళి పండుగకు పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.అందువల్ల గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు ఆ డేట్ ప్లస్ అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.2025 సంక్రాంతికి విశ్వంభర సినిమా ఫిక్స్ కావడంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి పండుగను టార్గెట్ చేసే ఛాన్స్ లేదు.పాన్ ఇండియా సినిమాలకు సోలో డేట్ దొరికితేనే బెటర్ అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.చరణ్ గత సినిమా ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.మరోవైపు శంకర్ సినిమాలు సైతం ఈ మధ్య కాలంలో అంచనాలు అందుకోవడం లేదు.

ఈ సినిమా అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ కోసం దిల్ రాజు భారీ స్థాయిలో ఖర్చు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube