సర్కస్ స్టంట్స్( Circus Stunts ) చాలా ప్రమాదకరమైనవి.ఇవి కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి.
ఇలా ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఇవి ప్రజల్ని కలవరపెడతాయి.
ఇటీవల ఇలాంటి మరొక డిస్టర్బింగ్ వీడియో వైరల్ గా మారింది.ఇందులో ఓ బాలుడి తల మీద బైక్ ఎక్కి వెళుతుంది.
అయిన చుట్టూ ఉన్నవాళ్లు ఏమీ చేయకుండా కూర్చున్నారు.కానీ నిజానికి ఇది ఒక సర్కస్ ప్రదర్శనలో భాగం అని తెలుస్తోంది.
వీడియోలో గ్రీన్ టీ షర్ట్ వేసుకున్న బాలుడు ఇటుకల మధ్య తల పెట్టుకుని పడుకున్నాడు.ఎర్ర షర్ట్ వేసుకున్న మరొక బాలుడు బైక్ తో( Bike ) వచ్చి, ఆ పడుకున్న బాబు తలమీద నుంచి వెళ్లడం కనిపించింది.కానీ, వెంటనే పడుకున్న బాలుడు నొప్పితో అరుస్తూ తల పట్టుకున్నాడు.తల గాయపడి,( Head Injured ) పగిలినట్లు కూడా అనిపించింది.అతను నొప్పితో కేకలు వేస్తూ ఉండగా, ఒక చిన్న పిల్ల, ఒక యువకుడు అతని దగ్గరకు పరుగులు తీశారు.బైక్ ఎక్కిన యువకుడు కూడా భయపడినట్లు కనిపిస్తున్నాడు.
ఏం జరిగిందో అర్థం చేసుకున్నట్లు ఉన్నాడు.కానీ, వీడియో అక్కడితో ఆగిపోయింది.
తరువాత ఏం జరిగిందో తెలియదు.
ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో @biki_sk83777 ఖాతా ద్వారా షేర్ చేయబడిన తర్వాత ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఈ వీడియోకు 31 లక్షలకు పైగా వ్యూస్, వందలాది వ్యాఖ్యలు వచ్చాయి.ఈ బాలుడి తలను పగలగొట్టి సరదా చూసుకున్నారా? అని ఒకరు ప్రశ్నించారు.సోషల్ మీడియా లైక్ల కోసం ప్రాణాంతక ప్రమాదాలకు గురికావద్దని మరొకరు హెచ్చరించారు.ఈ బాలుడు ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలను( Dangerous Stunts ) చేయడం మానేసి, సురక్షితమైన పనులు చేయాలని సలహా ఇచ్చారు.
@biki_sk83777 ఇన్స్టాగ్రామ్ ఖాతాను పరిశీలిస్తే, ఈ బాలుడు తరచుగా ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను షేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.వారి ప్రొఫైల్లో అనేక వీడియోలు ఉన్నాయి, ఇవి ప్రమాదకరమైన, హానికరమైన విన్యాసాలను ప్రదర్శిస్తాయి.
ఈ వీడియోలు నెటిజన్లలో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.