జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) మధ్య 2024 ఎన్నికలు చిచ్చుపెట్టాయి.వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం, ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో బన్నీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి.
బన్నీ అట్లీ కాంబో మూవీ ఆగిపోగా బన్నీ సుకుమార్ కాంబో మూవీ ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడి ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది.అయితే పవన్ కళ్యాణ్, బన్నీ మధ్య గ్యాప్ తగ్గితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్లు సైతం అల్లు అర్జున్ కెరీర్ పై ఇప్పుడు ప్రభావం చూపాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.చిరంజీవి తలచుకుంటే మాత్రమే పవన్, బన్నీ మధ్య గ్యాప్ ను తగ్గించడం తెలుస్తోంది.
మరి రాబోయే రోజుల్లో చిరంజీవి ( Chiranjeevi ) ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.బన్నీ తప్పు చేసినా ఆ తప్పు కావాలని చేయలేదనే సంగతి తెలిసిందే.
పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా ఎందుకు వాయిదా పడిందనే ప్రశ్నకు మేకర్స్ కొన్ని కారణాలు వెల్లడించినా ఆ కారణాలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప ది రూల్ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.బన్నీ మాత్రం వివాదాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు రావడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పుష్ప ది రూల్ మూవీ వాయిదా పడటం బన్నీ ఫ్యాన్స్ ను సైతం బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో బన్నీ పారితోషికం మాత్రం భారీ రేంజ్ లో ఉంది.