ఈ ఆహారాల‌ను డైట్ నుండి క‌ట్ చేయ‌కుంటే పెళ్లికి ముందే బట్టతల వస్తది!

బ‌ట్ట‌త‌ల‌.ఈ పేరు వింటేనే అబ్బాయిల మ‌దిలో ఏదో తెలియ‌ని కంగారు మొద‌ల‌వుతుంది.

అందులోనూ హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అయ్యేవారు ఇంకా భ‌య‌ప‌డుతుంటారు.ఒక‌ప్పుడు వ‌య‌సు పైబ‌డిన వారిలోనే బ‌ట్ట‌త‌ల క‌నిపించేది.

కానీ, ఈ రోజుల్లో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు.ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.

కొన్ని రకాల ఆహారాలను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుడ్డు.ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

సంపూర్ణ పోష‌కాహారంగా చెప్ప‌బడే గుడ్డును రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.కానీ, గుడ్డును ఉడికించ‌కుండా ప‌చ్చిగా తింటే మాత్రం పెళ్లికి ముందే బ‌ట్ట‌త‌ల వ‌స్త‌ది.

గుడ్డును పచ్చిగా తిన‌డం వ‌ల్ల బయోటిన్ లోపం, కెరోటిన్ ఉత్పత్తి త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతాయి.దాంతో హెయిర్ ఫాల్, బ‌ట్ట‌త‌ల‌, వైట్ హెయిర్ వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అలాగే బ‌ట్ట‌త‌ల‌కు దూరంగా ఉండాల‌నుకునే పురుషులు పంచ‌దార‌ను తీసుకోవ‌డం త‌గ్గించండి.కంప్లీట్‌గా ఎవైడ్ చేస్తే జుట్టుకు ఇంకా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.జంక్ ఫుడ్‌.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటికే అల‌వాటు ప‌డుతున్నారు.అయితే జంక్ ఫుడ్ శ‌రీర ఆరోగ్యాన్నే కాదు జుట్టు ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తుంది.

Advertisement

ముఖ్యంగా జంక్ ఫుడ్ లో డిహెచ్ టీ అని పిల‌వ‌బ‌డే ఆండ్రోజెన్ ఉంటుంది.ఇది బట్టతలకు దారితీస్తుంది.

కాబ‌ట్టి, డైట్ నుండి వీలైనంత వ‌ర‌కు జంక్ ఫుడ్‌ను క‌ట్ చేయండి.ఇక ఇవే కాకుండా క‌లుషితం అయిన చేప‌లు, కార్బోనేటేడ్ పానీయాలు, ఆయిలీ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌, మ‌ద్యం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

త‌ద్వారా బ‌ట్ట‌త‌ల వ‌చ్చే ప్ర‌మాదం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది.

తాజా వార్తలు