ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన నట్స్ లో బాదం( Almonds) ముందు వరుసలో ఉంటుంది.అధిక పోషకాలు కలిగి ఉండటం కారణంగా చాలా మంది తమ రెగ్యులర్ డైట్ లో బాదం పప్పును చేర్చుకుంటారు.
ఉదయం పూట నానబెట్టిన బాదం పప్పు తినే అలవాటు ఎంతో మందికి ఉంటుంది.కానీ బాదం పప్పును నానబెట్టే ఎందుకు తినాలి? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.వచ్చే ఉంటుంది.నట్స్ లో కొన్నిటిని డైరెక్ట్ గా తినొచ్చు.కొన్నిటిని మాత్రం నానబెట్టి తినాలి.
ముఖ్యంగా బాదం పప్పును కచ్చితంగా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొట్టు తొలగించి తినమని నిపుణులు చెబుతుంటారు.దాని వెనుక బలమైన కారణమే ఉంది.బాదం పప్పు జీర్ణం కావడం కష్టం.
ప్రధానంగా బాదం పొట్టులో యాంటీ న్యూట్రియంట్స్, ఫైటిక్ యాసిడ్ ఉంటాయి.ఇవి పిత్తాశయానికి సమస్యను తెస్తాయి.
అందుకే బాదం పప్పును నేరుగా కాకుండా నానబెట్టి పొట్టు తొలగించి తినమని నిపుణులు చెబుతుంటారు.పైగా బాదం పప్పును నానబెట్టడం వల్ల అందులోని పోషకాలు రెట్టింపు అవుతాయి.
బాదంలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.రోజు ఉదయం ఐదారు నానబెట్టిన బాదం గింజలను తింటే ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు.శరీరంలో తక్కువ మెగ్నీషియం స్థాయిలు అధిక రక్తపోటు( High Blood Pressure )కు కారణమవుతాయి.ఇది గుండెపోటు, పక్షవాతం మరియు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.అయితే బాదంలో మెగ్నీషియం ఉంటుంది.అందువల్ల నిత్యం బాదం పప్పు తింటే రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి.
అలాగే బాదం పప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు వాటిని స్థిరీకరిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా బాదంను డైట్ లో చేర్చుకోండి.
ఎందుకంటే బాదం లో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ మరియు తక్కువ స్థాయి కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇవి మీ ఆకలిని అరికడతాయి.
మరియు రోజువారీ కేలరీల సంఖ్యను తగ్గించడంలో తోడ్పడతాయి.బాదం పప్పులో సమృద్ధిగా ఉండే విటమిన్ ఇ మీ కళ్ళను కాపాడుతుంది.
దృష్టి సమస్యలను దూరం చేస్తుంది.చర్మానికి పోషణ అందిస్తుంది.
బాదం లో ఉండే పోషకాలు మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వ్యాధి, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తాయి.