బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన ఉత్సవాలు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా :బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్( Papanna Goud ) అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ) అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకను జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ లు పాల్గొన్నారు.

 Papanna Goud Is The Beacon Of Hope For The Underprivileged-TeluguStop.com

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై తోట ఆగయ్య మాట్లాడుతూ కడు పేదరికంతో బాధపడుతూ గోల్కొండ నవాబులపై సాయుధ పోరాటం చేసిన సర్దార్ పాపన్న అడుగుజాడల్లో నడువాలని సూచించారు.తనకంటూ సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకుని బడుగు బలహీనవర్గాల ప్రజలను నవాబుల పాలన నుండి విముక్తి చేశారని పేర్కొన్నారు.

మన పేదల పక్షపార్టీ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సబ్బండ వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని తెలిపారు.రాష్ట్రంలోని కళ్ళు గీతా కార్మికులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు.

ప్రభుత్వమే పాపన్న ఉత్సవాలను గత సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్, మండల గౌడ సంక్షేమ శాఖ అధ్యక్షులు గంట కార్తీగౌడ్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి( Krishna Reddy ), సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, ఎలగందుల అనసూయ.

సీనియర్ పాత్రికేయులు, బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎదురు గట్ల ముత్తయ్య గౌడ్.జిల్లా నాయకులు గంట వెంకటేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, గౌస్ బాయ్ , మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, శ్యామంతుల అనిల్ నర్సింలు, వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, గంట అంజా గౌడ్, నాగుల ప్రదీప్ గౌడ్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, చెట్కూరి తిరుపతి గౌడ్, గౌడ సోదరులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube