ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరభేరి జీపు యాత్ర

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్( Mallarapu Prashant ) రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరభేరి జీపు యాత్ర.బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ప్రారంభించడం జరిగిందని ముందుగా మండలం కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశాయాల సాధనకై ముందుకెళ్తామని అన్నారు.

 Samarabheri Jeep Trip Under Sfi , Sfi-TeluguStop.com

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్ కుమార్( Anil Kumar ), మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని అందుకే ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమ హాస్టల్లో గురుకులాలు కేజీబీవీ విద్యాసంస్థలు జూనియర్ కాలేజీలో సమస్యలకు నిలయాలుగా మారాయని తెలిపారు ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీల నిలబెట్టుకోవడం వల్ల వైఫల్యం చెందిందని అన్నారు తక్షణమే ఇంటర్నెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పెరిగిన ధరల అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసిన భర్తీ చేయాలని కోరినారు అదేవిధంగా మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తో విద్యారంగాన్ని పేద వర్గాలకు దూరం చేస్తుందని అన్నారు నూతన జాతీయ విద్యా విధానం భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైందని విద్యలో శాస్త్రీయమైనటువంటి దృక్పథానికి తూట్లు పొడిచే విధంగా ఉందని మాట్లాడినారు నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం చెందారని అన్నారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ దొంగ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కోరినారు ఈ జిల్లా విద్యారంగం సమగ్ర అభివృద్ధి కోసం ఎస్ ఎఫ్ ఐ సమరభేరి జీపు జాతా చేస్తుందని ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమరభేరి జీపు యాత్ర జయప్రదం కోసం విద్యార్థులు ఉపాధ్యాయులు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ సమరభేరి జీపు యాత్ర ద్వారా వచ్చిన సమస్యలను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు.ఆ తర్వాత సమస్యల పరిష్కారం కాకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమం లో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా నాయకులు వేణు, పెండల ఆదిత్య, రామ్ చరణ్, అభిషేక్, సంతోష్,పినకాషి నాగరాజు,చిగుర్లు అనిల్, సాయి చరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube